ETV Bharat / city

Southern Zonal Council Meeting: జోనల్​ కౌన్సిల్​ సమావేశానికి.. తెలంగాణ హోం మంత్రి

author img

By

Published : Nov 13, 2021, 9:51 AM IST

దక్షిణాది జోనల్ కౌన్సిల్ సమావేశానికి (Southern Zonal Council Meeting) తెలంగాణ నుంచి రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ (State Home Minister Mahmood Ali) హాజరు కానున్నారు. కేంద్ర హోమంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah) అధ్యక్షతన రేపు తిరుపతిలో సమావేశం జరగనుంది.

home-minister-mahmood-ali-will-be-attend-to-southern-zonal-council-meeting-from-telangana
జోనల్​ కౌన్సిల్​ సమావేశానికి హోం మంత్రి మహమూద్‌ అలీ!

ఈనెల 14న తిరుపతిలో జరగనున్న దక్షిణాది రాష్ట్రాల జోనల్​ కౌన్సిల్​ సమావేశానికి (Southern Zonal Council Meeting) తెలంగాణ రాష్ట్ర ప్రతినిధిగా హోంశాఖ మంత్రి మహమూద్ అలీ (State Home Minister Mahmood Ali) హాజరు కానున్నట్లు తెలిసింది. మహమూద్ అలీతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ (cs somesh kumar), సీనియర్ అధికారులు హాజరు కానున్నారు. దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారులు సమావేశానికి హాజరు కావాల్సి ఉంది. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ (cm kcr) ఈ సమావేశానికి హాజరు కావడం లేదని సమాచారం.

సమాధానాలు సిద్ధం..
సమావేశం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. రాష్ట్రానికి సంబంధించి ప్రస్తావించాల్సిన అంశాలు, పొరుగు రాష్ట్రాలు లేవనెత్తే అభ్యంతరాలకు చెప్పాల్సిన సమాధానాలను సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించి ఆయా శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులతో సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. జోనల్ కౌన్సిల్ ఎజెండాలో ఉన్న విద్యుత్, నీటిపారుదల, విభజన సంబంధిత అంశాలపై చర్చించారు. ఆ తర్వాత హోంమంత్రి మహమూద్ అలీ కూడా సీఎస్, అధికారులతో సమావేశమయ్యారు. జోనల్ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్రం తరఫున ప్రస్తావించాల్సిన అంశాలపై సమీక్షించారు.

వాటి ప్రకారం నడుచుకునేందుకు ఇబ్బంది లేదు
తెలంగాణ నుంచి తమకు 6,015 కోట్లకు పైగా విద్యుత్ బకాయిలు రావాలని కోరుతూ ఏపీ... ఎజెండాలో చేర్చింది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ నుంచి అంతకంటే చాలా ఎక్కువ మొత్తం రావాలని అంటున్న రాష్ట్ర ప్రభుత్వం... ఇదే విషయాన్ని మరోమారు సమావేశంలో వివరించనుంది. తొమ్మిది, పది షెడ్యూళ్లలోని సంస్థల విభజన అంశం కూడా ఎజెండాలో ఉంది. విభజన చట్టం, కేంద్ర మార్గదర్శకాల ప్రకారం నడుచుకునేందుకు ఎలాంటి ఇబ్బంది లేదని... అందుకు భిన్నంగా ఆస్తుల పంపిణీకి ఆస్కారం లేదని తెలంగాణ అంటోంది.

నదీ యాజమాన్య బోర్డులపైన చర్చ
పాలమూరు - రంగారెడ్డి (palamuru - rangareddy), డిండి ఎత్తిపోతల (dindi lift irrigation) పథకాలతో పాటు సంగంబండ ఆనకట్ట నిర్మాణాన్ని కర్ణాటక ఎజెండాలో ప్రతిపాదించింది. ఏపీ కూడా వీటిపై ఇప్పటికే ఫిర్యాదులు చేసింది. దీంతో కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటా, కేటాయింపులు తదితర అంశాలను భేటీలో ప్రస్తావించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. నదీ యాజమాన్య బోర్డులు (river management boards), నదుల అనుసంధానికి సంబంధించి కూడా రాష్ట్ర వాదనను పునరుధ్ఘాటించనున్నారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన వాటిని సమావేశంలో ప్రత్యేకంగా ప్రస్తావించనున్నారు. విభజన చట్టం హామీలను వీలైనంత త్వరగా నెరవేర్చాలని జోనల్ కౌన్సిల్ (Zonal Council meeting) వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నారు. ప్రత్యక్ష నగదు బదిలీ మిషన్, మహిళలు, చిన్నారులపై లైంగికదాడుల కేసుల సత్వర విచారణ, నిక్షయ్ పోషణ యోజన, జాతీయ కుష్టు నివారణ కార్యక్రమం, వివిధ రైల్వే పనులు, రోడ్డు మార్గాలు, ఇతర అంశాలపై సమావేశంలో చర్చ జరగనుంది.

ఇదీ చూడండి: Zonal Council meeting: జోనల్ కౌన్సిల్ సమావేశంలో గళం వినిపించేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.