ETV Bharat / city

విద్యుత్‌ ఒప్పందాల రద్దు అధికారం ప్రభుత్వానికి లేదు:హైకోర్టు - ppa

విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల రద్దు అధికారం ప్రభుత్వానికి లేదని హైకోర్టుస్పష్టంచేసింది.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవోను రద్దుచేసిన న్యాయస్థానం... టారిఫ్ ధరలపై విద్యుత్ తేల్చాల్సింది నియంత్రణా మండలేనని పేర్కొంది. విద్యుత్‌ నియంత్రణా మండలి అధికారాల్లోకి చొరబడే హక్కుప్రభుత్వానికి లేదన్న ధర్మాసనం రాష్ట్రం ఆదర్శవంతమైన యజమానిగా వ్యవహరించాలని వ్యాఖ్యానించింది

విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల రద్దు అధికారం ప్రభుత్వానికి లేదు:హైకోర్టు
author img

By

Published : Sep 25, 2019, 5:46 AM IST

Updated : Sep 25, 2019, 5:59 AM IST

పవన, సౌర విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల సమీక్షకు సంప్రదింపుల కమిటీని ఏర్పాటు చేస్తూ విద్యుత్‌ శాఖ జారీచేసిన జీవో నెం 63తోపాటు ఏపీఎస్పీడీసీఎల్ రాసి లేఖను హైకోర్టు రద్దుచేసింది. వివిధ సంస్థలుఉత్పత్తి చేస్తున్న విద్యుత్‌ను తీసుకోడానికి నిరాకరించొద్దని, పీపీఏలను గౌరవించాలని స్పష్టంచేసింది. యూనిట్‌ ధర ఎక్కువగా ఉందని విద్యుత్‌ కొనుగోళ్ల నిలిపివేతకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలివ్వడం సరికాదని. తెలిపింది. నిర్దిష్ట కారణాలున్నప్పుడే నిబంధనల మేరకు నోటీసులిచ్చి కోత విధించవచ్చని విద్యుత్‌ తీసుకునేందుకు నిరాకరిస్తే ఉత్పత్తి సంస్థలపై ఆర్థిక, ఇతర ప్రభావం పడుతుందని పేర్కొంది.

విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల రద్దు అధికారం ప్రభుత్వానికి లేదు:హైకోర్టు

ఒప్పందాలతో మీకు సంబంధం లేదు....
ఒప్పందాలతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధంలేదని, వాటిపై సంతకాలు చేసింది డిస్కంలని... హైకోర్టు గుర్తుచేసింది. ఎల్‌ఐసీ, యూటీఐ తదితర సంస్థలు విద్యుదుత్పత్తి సంస్థల్లో పెట్టుబడులుపెట్టాయని ఒప్పంద నిబంధనలను ఏకపక్షంగా మార్చడం చట్ట విరుద్ధమని స్పష్టంచేసింది.

ఆదర్శవంతమైన యజమానిగా వ్యవహరించండి...
శాంతిభద్రతలకు విఘాతం, ప్రకృతి వైపరీత్యాలు వంటి అసాధారణపరిస్థితుల్లోనే పీపీఏల్లో రాష్ట్ర ప్రభుత్వ జోక్యానికి నిబంధనలు అనుమతిస్తున్నాయన్న న్యాయస్థానం ఇప్పుడలాంటి పరిస్థితుల్లేవని తెలిపింది. ధరలు ఎక్కువగా ఉన్నాయని డిస్కంలు భావిస్తే అందుకు వాటికి ప్రత్యామ్నాయ మార్గాలున్నాయని వివరించింది. నిస్పాక్షికంగా, పారదర్శకంగా రాష్ట్రం ఆదర్శవంతమైన యజమానిగా వ్యవహరించాలని హైకోర్టు తన తీర్పులో సూచించింది.
అనుభవజ్ఞులకే వదిలేయండి...
మరోవైపు విద్యుత్‌ టారిఫ్‌ మదింపు, పునఃసమీక్షపై ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణామండలి ముందు తేల్చుకోవాలని. హైకోర్టు స్పష్టంచేసింది. టారిఫ్‌ నిర్థరణ, నిబంధనలు సాంకేతిక అంశాలతో ముడిపడినందున..విద్యుత్‌ రంగంలో అనుభవజ్ఞులకే ఈ విషయాన్ని వదిలేయడం ఉత్తమమమని అభిప్రాయపడింది. ఈఆర్​సీ లో హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తితోపాటు సాంకేతిక అంశాల్లో నైపుణ్యం ఉన్న ఇద్దరు వ్యక్తులు సభ్యులుగా ఉన్నారని గుర్తు చేసిన ధర్మాసనం... ప్రభుత్వం, సౌర, పవన విద్యుదుత్పత్తి సంస్థలు తమతమ అభ్యంతరాలను అక్కడ లేవనెత్తొచ్చని తెలిపింది.
మీ వాదనలతో ఏకీభవించం...
ధరలను పునఃసమీక్షించే అధికారం ఈఆర్​సీ కి లేదంటూ విద్యుదుత్పత్తి సంస్థలు చేసిన వాదనతోఏకీభవించలేమనీ..ధర్మాసనంస్పష్టంచేసింది. ఈఆర్​సీ నిర్ణయం వెలువరించే వరకూ..ప్రభుత్వం నిర్ణయించినమేరకు పవన విద్యుత్‌కు యూనిట్‌కు 2 రూపాయల 43 పైసలు,...సౌర విద్యుత్‌కు 2 రూపాయల 44 పైసలు చెల్లించాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. పాతబకాయిలు, భవిష్యత్‌లో చెల్లించాల్సిన బకాయిలకూ ఈ ఆదేశం వర్తిస్తుందని స్పష్టంచేసింది. భారీగా పెట‌్టుబడులు పెట్టామని, బకాయిలు రావాల్సి ఉందని విద్యుత్‌ సంస్థలు చెబుతున్నందున.. ఆరు నెలల్లో నిర్ణయం వెల్లడించాలని ఈఆర్​సీ ని ఆదేశించింది.

ఇవీ చూడండి-పీపీఏలపై వైకాపా ఆరోపణలు అవాస్తవమని తేలింది:తెదేపా

Intro:గుంటూరు జిల్లా చిలకలూరిపేట ప్రాంతంలో మంగళవారం భారీ వర్షం కురిసింది దీంతో రహదారులపై పెద్ద ఎత్తున వర్షపు నీరు ప్రవహించిందిBody:గుంటూరు జిల్లా చిలకలూరిపేట ప్రాంతంలో మంగళవారం భారీ వర్షం కురిసింది.. దీంతో చిలకలూరిపేట నరసరావుపేట మార్గంలో కోమటినేనివారి పాలెం- గంగన్న పాలెం మధ్య రహదారిపై రెండు గంటలసేపు అడుగు ఎత్తున వర్షపు నీరు ప్రవహించింది ..గ్రామాలలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ..ప్రధాన వాగు లైన ఓగేరు ,కుప్ప గంజి, నక్క వాగు, నల్లవాగు లలో వరద ప్రవాహం పెరిగింది.Conclusion:మల్లికార్జునరావు ఈటీవీ భారత్ చిలకలూరిపేట గుంటూరు జిల్లా ఫోన్ నెంబర్ 8 0 0 8 8 8 3 2 1 7
Last Updated : Sep 25, 2019, 5:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.