రెవెన్యూ (ఎక్సైజ్) శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవపై జారీచేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ ను హైకోర్టు ఉపసంహరించింది. సమాచార లోపం వల్ల కోర్టు విచారణకు రాలేకపోయానని శుక్రవారం నాటి విచారణకు హాజరై రజత్ భార్గవ న్యాయమూర్తికి విన్నవించారు. ఎన్బీడబ్ల్యూని వెనక్కి తీసుకోవాలని అభ్యర్థించారు. ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ .. ఎన్బీడబ్ల్యూని ఉపసంహరిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. విజయవాడలో మెక్రో బ్రూవరీ ఏర్పాటు కోసం తుది లైసెన్స్ మంజూరు చేయాలని కోరుతూ దాఖలు చేసిన దరఖాస్తును అధికారులు పరిష్కరించలేదని కమల్ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై కోర్టు లేవనెత్తిన సందేహాలకు స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని రజత్ భార్గవ్‌ను న్యాయమూర్తి ఆదేశించారు. ఈనెల 2 న జరిగిన విచారణకు అధికారి హాజరుకాకపోవడంతో ఎన్బీడబ్ల్యూ ను జారీ చేశారు.
ఇదీ చదవండి: