పోలవరం జల విద్యుత్తు ప్రాజెక్టు పనుల్లో మంగళవారం వరకు... ముందుకెళ్లొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు... అక్కడ యథాతథ స్థితిని కొనసాగించాలని తేల్చి చెప్పింది. ఏపీజెన్‌కో ఛైర్మన్, జెన్‌కో చీఫ్ ఇంజినీర్, పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవోతో సహా పలువురికి నోటీసులు జారీ చేసింది. ప్రమాణపత్రం దాఖలు చేయాలని పేర్కొంటూ... విచారణను ఈ నెల 12కి వాయిదా వేసింది.
హైకోర్టులో నవయుగ సంస్థ తరఫున వాదనలు విన్న అనంతరం... అప్పీలును విచారణకు స్వీకరిస్తూ ఉన్నత న్యాయస్థానం ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది. ప్రభుత్వం తరఫున వాదించిన అడ్వకేట్ జనరల్ శ్రీరామ్... సింగిల్ జడ్జి ఉత్తర్వులను నిలుపుదల చేయొద్దని కోరారు. అయితే నవయుగ సంస్థ అప్పీలును విచారణకు స్వీకరించిన నేపథ్యంలో... ఉత్తర్వులు నిలుపుదల చేయాల్సిందేనని ధర్మాసనం స్పష్టం చేసింది.
తమ వాదనలు వినిపించేందుకు ఏజీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ... వాదనలు చెప్పేందుకు తావివ్వాలని కోరడంతో ధర్మాసనం అంగీరించింది. సింగిల్ జడ్జి స్టే ఎత్తివేశాకే పీహెచ్ఈపీ ఒప్పంద పనులు ఓ సంస్థకు ఇచ్చామన్నారు. రివర్స్ టెండర్ ద్వారా ముందుకెళ్లటంతో... ప్రజాధనం ఆదా అయ్యిందన్నారు. 3 నెలలుగా పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం జరుగుతున్న పనులను ఆపొద్దు అని కోరారు.
ఇదీ చదవండీ... పోలవరం ప్రాజెక్టుపై కొత్త లెక్కలు కోరిన కేంద్రం