ETV Bharat / city

HIGH COURT: ఠాణాల్లో సవ్యంగా లేదని స్పష్టమవుతోంది.. - ఠాణాల్లో సవ్యంగా లేదని స్పష్టమవుతోంది

వ్యక్తుల అక్రమ నిర్బంధంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో పోలీసులు ఇలాంటి పరిస్థితులను కల్పించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటువంటి చర్యలను సహించబోమని స్పష్టం చేసింది.

HIGH COURT
HIGH COURT
author img

By

Published : Sep 25, 2021, 5:01 AM IST

వ్యక్తుల అక్రమ నిర్బంధం విషయంలో పోలీసుల తీరుపై హైకోర్టు మండిపడింది. తమ బంధువులను పోలీసులు అక్రమంగా నిర్బంధించారని హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు(high court over Habeas Corpus petitions) చేశాక.. ఒక రోజు ముందు అరెస్టు చేసినట్లు చూపుతూ ఆ వ్యక్తులను మేజిస్ట్రేట్‌ వద్ద పోలీసులు హాజరుపరుస్తున్నారని ఆక్షేపించింది. పోలీసులు ఓ పద్ధతి ప్రకారం ఇలా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోందని పేర్కొంది. గత కొంతకాలంగా హెబియస్‌ కార్పస్‌ పిటిషన్ల విచారణ సందర్భంగా ఈ అంశాన్ని తాము గమనించామని తెలిపింది. ప్రస్తుత కేసులోని వివరాల్ని పరిశీలించాక.. రాష్ట్రంలోని పోలీసుస్టేషన్లలో అంతా సవ్యంగా లేదనే విషయం స్పష్టమవుతోందని వ్యాఖ్యానించింది. ఇలాంటి పరిస్థితులను తాము సహించబోమని, విచక్షణాధికారాలను వినియోగించాల్సి ఉంటుందని హెచ్చరించింది. భవిష్యత్తులో అక్రమ నిర్బంధాలు జరగకుండా చర్యలు తీసుకునేలా పోలీసు ఉన్నతాధికారులకు సూచించాలని అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌కు స్పష్టం చేసింది. ఏదైనా చట్ట ప్రకారం జరగాలని పేర్కొంది. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట పోలీసుల చేతిలో చిత్రహింసలకు గురై, ప్రస్తుతం కాకినాడ సబ్‌జైల్లో ఉన్న కంచర్ల నవీన్‌బాబు, వాసుమిల్లి అశోక్‌లకు ప్రభుత్వాసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈమేరకు ఆదేశాలిచ్చింది.

తన భర్త కంచర్ల నవీన్‌బాబు, మరోవ్యక్తి వాసుమిల్లి అశోక్‌లను కొత్తపేట పోలీసులు ఆగస్టు 30న అక్రమ నిర్బంధంలోకి తీసుకొని థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారని, వారిని కోర్టులో హాజరుపరిచేలా ఆదేశించాలని కోరుతూ గుంటూరు జిల్లా కొల్లూరు మండలం తోకలవానిపాలేనికి చెందిన షేక్‌ అక్తర్‌ రోషన్‌ హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాలతో విచారణ జరిపిన అదనపు డీజీ రవిశంకర్‌ శుక్రవారం హైకోర్టుకు సీల్డ్‌ కవర్లో నివేదిక ఇచ్చారు. దానిని పరిశీలించిన ధర్మాసనం.. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సీసీటీవీ ఫుటేజిలను సీజ్‌ చేయాలని ఆదేశిస్తామని తెలిపింది. బాధ్యులపై చర్యలేంటో కోర్టు ముందు ఉంచాలని ఆదేశించింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది కె.రాజారెడ్డి వాదనలు వినిపిస్తూ.. నవీన్‌బాబు, అశోక్‌లను పోలీసులు మేజిస్ట్రేట్‌ ముందు హాజరు పరిచారన్నారు. ప్రస్తుతం జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న వారికి వైద్యపరీక్షలు నిర్వహించి నివేదిక తెప్పించాలని కోరారు. ఏజీ ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ.. అక్రమ నిర్బంధాలు చోటుచేసుకోకుండా చూస్తామన్నారు. అతిక్రమణలకు పాల్పడితే పోలీసులపై చర్యలు తీసుకుంటామన్నారు.

కొత్తపేట ఎస్సై శ్రీనివాస్‌ నాయక్‌ సస్పెన్షన్‌..

కొత్తపేట, రావులపాలెం గ్రామీణం, న్యూస్‌టుడే: ఇద్దరు వ్యక్తులను అక్రమ నిర్బంధం చేసిన ఘటనలో తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఎస్సై శ్రీనివాస్‌నాయక్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేసినట్లు జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు శుక్రవారం తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు అడిషనల్‌ డీజీపీ రవిశంకర్‌ అయ్యర్‌, ఏలూరు రేంజ్‌ డీఐజీ కె.వి.మోహన్‌రావు ఈ నెల 22న కొత్తపేట పోలీసుస్టేషనకు వచ్చి విచారణ చేపట్టారు. ఎస్సైపై వచ్చిన అభియోగాలు నిర్ధారణ కావడంతో ఆయనను సస్పెండ్‌ చేసినట్లు, రావులపాలెం సీఐ వి.కృష్ణకు ఛార్జిమెమో ఇచ్చినట్లు ఎస్పీ వివరించారు.

ఇదీ చదవండి:

PARISHAD: జిల్లా పరిషత్‌ చైర్మన్లు, వైస్ ఛైర్మన్లు, కో ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక నేడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.