HIGH COURT: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) అధికారపార్టీ వైకాపాకు రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందని, ఛైర్మన్, సభ్యుల నియామకాలను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం(పిల్)పై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని పేర్కొంటూ ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతం సవాంగ్, సభ్యులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలనశాఖ ముఖ్యకార్యదర్శికి నోటీసులు జారీచేసింది. విచారణను జులై 11కు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర, జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. సామర్థ్యం, యోగ్యత, విద్యార్హతలు లేనివారిని ఏపీపీఎస్సీ ఛైర్మన్, సభ్యులుగా నియమించారని, వారిలో ఎక్కువ మంది అధికార వైకాపాకు చెందినవారని పేర్కొంటూ హైకోర్టు న్యాయవాది తాండవ యోగేశ్ హైకోర్టులో పిల్ వేసిన విషయం తెలిసిందే.
ఇవీ చదవండి: