న్యాయస్థానంపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ.. పోస్టులు పెటారనే అంశంపై వేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. తాము కౌంటర్లు దాఖలు చేశామని కొందరు ప్రతివాదుల న్యాయవాదులు చెప్పినప్పటికీ అవి అప్లోడ్ కాలేదు. దీంతో కౌంటర్లు, వకాలత్ ప్రక్రియ పూర్తి చేసుకునేందుకు న్యాయస్థానం నెల రోజుల సమయం ఇచ్చింది. తదుపరి విచారణను నెల రోజులకు వాయిదా వేసింది. ఈ కేసులో ఇప్పటికే సీఐడీ అధికారులు 70 మందికి పైగా సామాజిక మాధ్యమాల్లో అనుచితంగా పోస్టులు పెట్టినవారిని గుర్తించారు. కొందరికి నోటీసులు ఇచ్చి విచారణ జరిపారు. సీఐడీ అధికారులు దీనిపై మిగిలిన వారి వివరాలు సేకరించి నోటీసులు ఇచ్చే పనిలో ఉన్నారు. పోస్టులు పెట్టిన వారితో పాటు గూగుల్, వాట్సప్, ట్విట్టర్ లాంటి సంస్థలకు సైతం నోటీసులు ఇప్పటికే అందజేశారు.
ఇదీ చదవండి: సుధాకర్ కేసులో కుట్ర కోణం... విచారణకు మరింత సమయం : సీబీఐ