ETV Bharat / city

స్థానిక ఎన్నికల నిర్వహణ తీరుపై.. తుది నిర్ణయం ఎస్‌ఈసీదే: హైకోర్టు - ప్రభుత్వంపై హైకోర్టు కామెంట్స్

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు అనుమతిస్తూ.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికలు ఆపేందుకు సహేతుక కారణాలు లేవని స్పష్టం చేసింది. రాజ్యాంగం 9వ షెడ్యూల్‌ ప్రకారం కాలపరిమితిలోగా ఎన్నికలు తప్పనిసరి అని గుర్తు చేసింది.

ఎన్నికలు ఎలా నిర్వహించాలనే దానిపై తుదినిర్ణయం ఎస్‌ఈసీదే: హైకోర్టు

author img

By

Published : Jan 21, 2021, 1:30 PM IST

పంచాయతీ ఎన్నికలకు అనుమతించిన హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ ప్రతినిధులను ఎన్నుకునే హక్కు ప్రజలకు ఉంటుందని గుర్తు చేసింది. ఎన్నికలు ఎలా నిర్వహించాలనే విషయంపై తుది నిర్ణయం రాష్ట్ర ఎన్నికల సంఘానిదే అని స్పష్టం చేసింది.

'సీఈసీకి ఉన్న అధికారాలే ఎస్‌ఈసీకి ఉన్నాయి. సింగిల్ బెంచ్ తీర్పు ప్రాథమిక సూత్రాలకు భిన్నంగా ఉంది. ఎస్‌ఈసీకి దురుద్దేశాలు ఆపాదించడం సరికాదు. ఎన్నికైన నేతలు వ్యాక్సినేషన్‌ను ముందుకు తీసుకువెళ్తారు. వ్యాక్సినేషన్ పేరుతో ఎన్నికల వాయిదా కోరడం సరికాదు. మూడో దశలో భారీ సంఖ్యలో వ్యాక్సినేషన్ ఉన్నందున ఈలోగా ఎన్నికలు సబబే' అని హైకోర్టు స్పష్టం చేసింది.

అమెరికాతో పాటు.. మన దేశంలోనూ చాలా ప్రాంతాల్లో కరోనా ప్రభావం ఉన్న సమయంలోనూ.. ఎన్నికలు జరిగాయని ధర్మాసనం గుర్తు చేసింది. ఇప్పటికే రెండున్నర ఏళ్లుగా స్థానిక ఎన్నికలు జరగలేదని చెప్పిన హైకోర్టు... టీకాల పేరుతో 2022 వరకు జరపరాదనే ఉద్దేశముందా అనే ప్రశ్న తలెత్తుతోందని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ సహకారం లేకుంటే ఎస్‌ఈసీ మళ్లీ కోర్టుకు రావచ్చని ధర్మాసనం స్పష్టం చేసింది.

ఇదీ చదవండి:

పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.