ETV Bharat / city

TS High Court : 'రోజుకు లక్ష ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలి ' - తెలంగాణలో కరోనా పరీక్షలు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఆ రాష్ట్ర హైకోర్టు విచారణ జరిపింది. రోజుకు లక్ష ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. భౌతికదూరం, మాస్కుల నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది.

TS High Court
TS High Court
author img

By

Published : Jan 17, 2022, 3:53 PM IST

TS High Court : కరోనా వ్యాప్తి నియంత్రణకు మరింత అప్రమత్తత అవసరమన్న తెలంగాణ హైకోర్టు.. ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్య పెంచాలని ఆదేశించింది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. రోజుకు లక్ష ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షల వివరాలు, హెల్త్‌ బులెటిన్‌లో వేర్వేరుగా ఇవ్వాలని పేర్కొంది.

కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ
Telangana high court about corona : భౌతికదూరం, మాస్కుల నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. కరోనా నియంత్రణపై మంత్రివర్గం ఇవాళ చర్చించనుందని అడ్వకేట్‌ జనరల్‌ హైకోర్టుకు తెలపగా.. పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అనంతరం కరోనా కేసులపై విచారణను ఈనెల 25కు వాయిదా వేసింది.

రేపట్నుంచి వర్చువల్‌గా కేసుల విచారణ
కొవిడ్‌ వ్యాప్తి వల్ల హైకోర్టులో రేపటి నుంచి మళ్లీ వర్చువల్‌గా కేసుల విచారణ జరగనుంది. పూర్తిస్థాయి విచారణలనూ రాష్ట్ర ఉన్నతన్యాయస్థానం ఆన్‌లైన్‌లోనే చేపట్టనుంది.

ఇదీ చదవండి

CM Jagan Review: కొవిడ్, వైద్య ఆరోగ్యశాఖపై సీఎం జగన్ సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.