మూడు గంటలపాటు ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి తెంలగాణలోని హైదరాబాద్ నగరం తడిసి ముద్దైంది. నగరంలో కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులుతో కూడిన వర్షం పడగా మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో వాన పడింది. కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దసరా పండుగకు స్వగ్రామలకు వెళ్ళేందుఉ రిజర్వేషన్లు చేసుకున్న ప్రయాణికులు బస్సు బయల్దేరే సమయానికి చేరుకోలేక గంటల తరబడి వర్షంలేనే అవస్థలు పడ్డడారు.
పలు ప్రాంతాలు జలమయం
పలు ప్రాంతాలనుంచి వాహనాలు నగరంలోకి వచ్చే హయత్ నగర్ ప్రాంతంలో భారీ వర్షపాతం నమోదైంది, హయత్ నగర్‌తో పాటు వనస్థలీపురం, ఎల్బీనగర్, మన్సురాబాద్, నాగోల్, వనస్థలిపురం, బీయన్ రెడ్డి నగర్, మీర్‌పేట్‌లలో భారీ వర్షం కురిసింది. 65వ జాతీయ రహదారిపై వర్షపు నీరు చేరడంతో వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఎదురైంది. ఈదురు గాలుల కారణంగా విద్యత్ సరఫరా నిలిపివేయడంతో ప్రజలు అంధకారంలోనే గంటల పాటు గడిపారు. సరూర్ నగర్ , కొత్తపేట , చైతన్య పురి, దిల్సుఖ్నగర్ , మలక్ పేట, చాదర్ ఘాట్, సైదాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉప్పల్, రామంతాపూర్, బోడుప్పల్, మేడిపల్లి, పీర్జాదిగూడలలో ఓ మోస్తరు వర్షం కురిసింది. మల్కాజిగిరి, నేరెడీమేట్, కుషాయిగూడ, చర్లపల్లి మరియు దమ్మాయిగూడా లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది.తార్నాక, నాచారం లో కురిసిన వర్షానికి పలు కాలనీల్లోకి వర్షపునీరు చేరింది. భారీ వర్షాలతో పాత బస్తీలోని కాలనీలు జలమయమయ్యాయి. రెయిన్ బజార్, చత్రీనాక, కర్మాన్‌ఘాట్‌లోని కాలనీలు నీట మునిగాయి. చాంద్రాయణగుట్ట నియోజకవర్గం జంగమ్మ డివిజన్ లక్ష్మీనగర్‌లో 3 అడుగుల మేర వరద నీరు పారడంతో ఇళ్ళోకి నీరు చేరి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చంపాపేట్ డీమార్ట్ వద్ద భారీ వర్షానికి రహదారి పై నీరు చేరడంతో ఇరువైపులా స్తంబించింది. వస్తువులు కొనేందుకు వచ్చిన వారు గంటల కొద్దీ బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. సికింద్రాబాద్ బోయిన్ పల్లి లో కురిసి వర్షానికి ట్రాఫిక్ స్తంభించింది.
అత్యధికంగా మహేశ్వరంలో 14 సెంటీమీటర్లు
భారీ వర్షాల కారణంగా అప్రమత్తం అయిన జీహెచ్ఎంసీ, డీఆర్‌ఎఫ్ బృందాలు రంగలోకి దిగి సహయక చర్యలు చేపట్టారు. రోడ్లపై నీరు నిలిచి ప్రాంతాల్లో వాటిని క్లియర్ చేశారు. నగరంలో రాత్రి 11 గంటల వరకూ నమోదైన వర్షపాతం వివరాలు ఈ విధంగా ఉన్నాయి మహేశ్వరంలో 14 సెంటీమీటర్లు, సరూర్ నగర్ 13, నందిగామ 12, సైదాబాద్ 12, ఎల్బీనగర్ 11, హయత్ నగర్ 11, మహంకాల్ 10, సరూర్ నగర్ విరాట్ నగర్ 10, చార్మినార్ 10, బడ్లగూడ 10, శంషాబాద్ 10, బహదూర్ పురా 10, రాజేంద్ర నగర్ 9, ఫరూక్ నగర్ 9, ఇబ్రహీంపట్నం 8 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది.
గల్లంతైన వ్యక్తి సురక్షితం
ఎల్బీ నగర్లో భారీ వర్షం కారణంగా చింతల కుంట వద్ద ఓ ద్విచక్ర వాహానదారుడు వరద ప్రవాహంలో బైక్ తో సహా కొట్టకుపోయాడు. గమనించిన స్థానికులు అతన్ని కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలానికి చేరుకుని ద్విచక్ర వాహనాన్ని బయటకు తీశారు. డీఆర్‌ఎఫ్ బృందాలు గల్లంతైన వ్యక్తి కోసం గాలింప చేపట్టారు. ఘటనా స్థాలాన్ని మేయర్ గద్వాల విజయ లక్ష్మి, స్థానిక ఎమ్‌ఎల్యే సుధీర్ రెడ్డి పరిశీలించారు. ఇంతలో గల్లంతైన వ్యక్తి సురక్షితంగా తిరిగి వచ్చాడని తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గల్లంతైన వ్యక్తి సరూర్ నగర్ కు చెదిన అటో డ్రైవర్ జగదీష్ గా గుర్తించారు. మరో వైపు చంపాపేట లోని నాలలో బైక్ తో సహా వ్యక్తి కొట్టుకుపోయారని సమాచారంతో అక్కడికి చేరుకున్న అధికారులు అవాస్తవమని గుర్తించారు.
ఇదీ చూడండి: HYDERABAD RAINS: భాగ్యనగరాన్ని ముంచెత్తిన వర్షం.. నాలాలో పడిన వ్యక్తి సురక్షితం