Rain in Hyderabad: తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. బేగంపేట, ఎర్రగడ్డ, సోమాజిగూడ, ఖైరతాబాద్, అమీర్‌పేట, నాగారం, షేక్‌పేట, గోల్కొండ, టోలీచౌకి, మెహాదీపట్నం, బోయిన్‌పల్లి, అల్వాల్, మారేడ్‌పల్లి, తిరుమలగిరి, ప్యారడైజ్, చిలకలగూడ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రాత్రి పదకొండు గంటల సమయంలో ప్రారంభమైన వర్షం తెల్లవారుజాము వరకు పడింది.
ఒక్కసారిగా వర్షం రావడంతో రహదారులపై నీరు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఈదురుగాలుల కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వర్షపు నీరు రోడ్లపై ప్రవహించడంతో వాహానదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షపు నీటితో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అల్వాల్‌లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
ఇవీ చూడండి:
ఉద్దానంలో భల్లూకం బీభత్సం.. ఏడుగురిపై దాడి