High Court on mid day level health posts: మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్స్ నియామక పరీక్ష నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని, ప్రక్రియను నిలువరిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ ప్రభుత్వం చేసిన అభ్యర్ధనను హైకోర్టు తిరస్కరించింది. విచారణను ఈనెల 9న చేపడతామని పేర్కొంది. డాక్టర్ వైఎస్ఆర్ గ్రామీణ ఆరోగ్య క్లినిక్లు-ఆరోగ్య, వెల్నెస్ కేంద్రాల్లో 1681 ఎంఎల్హెచ్పి నియామక నోటిఫికేషన్ను సవాలు చేస్తూ ఒంగోలుకు చెందిన వైద్యులు శివకృష్ణ గతంలో హైకోర్టును ఆశ్రయించారు. ఆయుర్వేద వైద్యలకు పోస్టుల భర్తీలో అవకాశం కల్పించడకపోవడం చట్ట విరుద్ధమన్నారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల విచారణ జరిపిన న్యాయస్థానం.. నియామక ప్రక్రియను నిలుపుదల చేసింది. తాజాగా జరిగిన విచారణలో ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. 6వ తేదీ పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నామన్నారు. స్టే ఎత్తివేసి ముందుకెళ్లేందుకు అనుమతివ్వాలని కోరారు . పరీక్ష నిర్వహణకు రూ. లక్షల్లో సొమ్ము ఖర్చు చేశామన్నారు. అభ్యర్థనను పిటిషనర్ తరపు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వ్యతిరేకించారు. దీంతో స్టే ఎత్తివేతకు హైకోర్టు నిరాకరించింది.
ఇవీ చదవండి: