High Court: విద్యాసంస్థల్లో 25 శాతం సీట్ల కేటాయింపు ఉత్తర్వులపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఉత్తర్వులకు వ్యతిరేకంగా యూపీఈఐఎఫ్(యూనైటెడ్ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ ఫెడరేషన్)... హైకోర్టును ఆశ్రయించింది. పిటిషనర్ తరఫున మతకుమిల్లి శ్రీవిజయ్ వాదనలు వినిపించారు. కేంద్రం ఇచ్చిన స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్‌కు వ్యతిరేకంగా ఉన్నాయని వాదించారు. పాఠశాల గుర్తింపును రద్దు చేస్తామని బెదిరిస్తున్నారని పిటిషినర్ పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం... పాఠశాలలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. తదపరి విచారణను మూడు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.
ఇవీ చదవండి: