పంచాయతీ కార్యాలయాలకు వేసిన వైకాపా జెండా రంగుల్ని తీసేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 3 నెలల గడువు కోరడంపై హైక్టోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మూడు నెలల గడువిస్తాం... అప్పటివరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా ఉంటారా? అని ప్రశ్నించింది. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యే వరకు రాజకీయ రంగులు తొలగించకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఎక్కువ సమయం కోరుతున్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. 3 నెలల గడువు ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చిచెప్పింది. ప్రభుత్వం తరఫున న్యాయవాది స్పందిస్తూ... లాక్‌డౌన్ ఎత్తివేశాక పార్టీ రంగులు తొలగించి... కొత్త రంగులేయడానికి ఎంత సమయం పడుతుందో అధికారుల నుంచి సమాచారం తీసుకుని కోర్టుకు చెబుతామన్నారు. విచారణను సోమవారానికి వాయిదా వేయాలని కోరారు. దీనికి ధర్మాసనం అంగీకరిస్తూ... విచారణ సోమవారానికి వాయిదా వేసింది.
'3 నెలలు గడువిస్తాం..స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా ఉంటారా..?'
రాష్ట్ర ప్రభుత్వం తీరు పై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పంచాయతీ కార్యాలయాలకు వేసిన వైకాపా జెండా రంగుల్ని తీసేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 3 నెలల గడువు కోరింది. 3నెలల గడువిస్తాం... అప్పటివరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా ఉంటారా? అని ప్రశ్నించింది.