ETV Bharat / city

తెలంగాణ: మూఢం ప్రభావం... పలువురి ఉపాధి ప్రశ్నార్ధకం - telangana latest news

మొన్నటి వరకు కరోనా.. లాక్​డౌన్​తో శుభకార్యాలకు బ్రేకులు పడ్డాయి. వివిధ రంగాలపై ఆధారపడిన వేతన జీవులను ఆర్థిక కష్టాలు వెంటాడాయి. కొవిడ్​ వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో.. కొత్త సంవత్సరంలోనైనా ఆర్థికంగా నిలదొక్కుకుందామనుకున్న సామాన్యుల పరిస్థితి మరోసారి ప్రశ్నార్ధకంగా మారింది. మౌఢ్యం కారణంగా సుమారు నాలుగు నెలలపాటు శుభకార్యాల నిర్వహణకు వీల్లేదన్న వేద పండితుల వాక్కులు.. మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా తయారైందని తెలంగాణ రాష్ట్ర ప్రజలు వాపోతున్నారు.

guru-sukra-moodam-effect-on-many-workers
తెలంగాణ: మూఢం ప్రభావం... పలువురి ఉపాధి ప్రశ్నార్ధకం...
author img

By

Published : Feb 15, 2021, 9:42 PM IST

తెలంగాణ: మూఢం ప్రభావం... పలువురి ఉపాధి ప్రశ్నార్ధకం...

గతేడాది కరోనా విలయం.. ఈ సంవత్సరంలో మూఢం.. ఫలితంగా శ్రమనే నమ్ముకొని జీవనం సాగిస్తున్న వివిధ రంగాల ప్రజలు ఆర్థికంగా నానా అవస్థలు పడుతున్నారు. కరోనా ప్రభావంతో దేశవ్యాప్తంగా విధించిన లాక్​డౌన్​ వల్ల అనేక రంగాలు కుదేలయ్యాయి. పెద్ద, చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధితో జీవనం సాగించేవారు, దినసరి కూలీల జీవితాలు దుర్భరమయ్యాయి. ఆ దెబ్బ నుంచి తేరుకొనేలోపే.. మౌఢ్యం వచ్చి పడింది. ఫలితంగా నిర్మాణ రంగం, వివాహాల, వేడుకలు వంటి శుభముహూర్తాలు దొరకని పరిస్థితి నెలకొంది. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మంథనిలో ఆయా రంగాలపై ఆధారపడినవారి ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోంది. వేదపండితులు, వస్త్ర వ్యాపారులు, ఫంక్షన్​ హాల్​, సౌండ్​ సిస్టం నిర్వహకులు, మంగళ వాద్య కళాకారుల ఉపాధి ప్రశ్నార్ధకంగా మారింది.

అసలు ఏంటీ మౌఢ్యం..

సూర్యునికి దగ్గరగా గురు, శుక్ర గ్రహాలు రావడం.. ఫలితంగా వాటి బలం తగ్గుతుందంటున్నారు.. వేద పండితులు. ఇలా గ్రహాల బలం తగ్గడాన్నే మౌఢ్యం అంటారని పేర్కొన్నారు. ఇలాంటి సమయం శుభకార్యాలకు పనికిరావని పండితులు పేర్కొంటున్నారు. జనవరి 8న చివరగా అనేక వివాహాలు, గృహప్రవేశాలు, శుభకార్యాలు జరిగాయని.. మళ్లీ మే 14 వరకు ఎటువంటి ముహూర్తాలు లేవన్నారు. ఉగాది, వసంత పంచమి, రథసప్తమి వంటి పర్వదినాలు మధ్యలో వచ్చినా.. అవేవి బలమైన ముహూర్తాలు కావని పండితులు చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో హోమాలు, అభిషేకాలు, శ్రీమంతం, అన్నప్రాసన, నామకరణ వంటి కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చునన్నారు.

పలువురు ఉపాధి ప్రశ్నార్ధకం..

శుభకార్యాలపైనే ఆధారపడి జీవిస్తున్న తమకు మౌఢ్యం కారణంగా ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయని.. పెద్దపల్లి జిల్లా మంథనిలో ఆయా రంగాలపై ఆధారపడి జీవిస్తున్న పలువురు వాపోతున్నారు. నాలుగు నెలలపాటు తమ ఉపాధి ప్రశ్నార్ధకంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనాతో మొదలైన కష్టాలు.. గురు, శుక్ర మౌఢ్యం కారణంగా మరింత ఎక్కువయ్యాయని వాపోతున్నారు.

అధిక వడ్డీలతో వస్తువులు, వస్త్రాలను కొని తీసుకొచ్చామని.. ప్రజలు కనీసం తమవైపు చూస్తాలేరంటున్నారు. ప్రత్యేక ఆఫర్లు పెట్టినా.. నిర్వహణ ఖర్చులూ రావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ ఫంక్షన్​హాల్​లోని అన్ని వస్తువులు చెడిపోతున్నాయని ఓ యజమాని వాపోయారు. మంగళ వాద్యాలు, మ్యూజిక్ సిస్టమ్, డెకరేషన్​ కార్మికులు ఉపాధి లేక విలవిలలాడిపోతున్నారు. తమకు ఈ వృత్తి తప్ప మరో పని చేతకాదని.. కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆ తర్వాత కొద్దిరోజులే..

మే 14 నుంచి శుభముహూర్తాలున్నా.. కొద్దిరోజుల పాటు మాత్రమే ఉన్నాయని పండితులు చెబుతున్నారు. జులై 4 నుంచి ఆషాడమాసం ప్రారంభమై ఆగస్టు 11 తో ముగుస్తుందన్నారు. ఆ మధ్య కాలంలోనూ వివాహాలకు అనుకూలం కావని పండితులు పేర్కొంటున్నారు.

ఇవీచూడండి:

ప్రజాసేవ చేయడానికి రాజకీయాలతో పని లేదు: సోనూసూద్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.