ETV Bharat / city

తెలంగాణ : ఆదాయానికి మించి ఆస్తుల కేసులో జీఎస్‌టీ అధికారి అరెస్టు - జగన్ అక్రమాస్తుల కేసు

తెలంగాణలో ఆదాయానికి మించి ఆస్తుల కేసులో జీఎస్‌టీ అధికారి బి.ఎస్.గాంధీని సీబీఐ అరెస్ట్​ చేసింది. ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ అసిస్టెంట్ డైరెక్టర్​గా బీఎస్ గాంధీ ఉన్నప్పుడు జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తు అధికారిగా వ్యవహరించారు.

gst officer arrest
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో జీఎస్‌టీ అధికారి గాంధీ అరెస్టు
author img

By

Published : Apr 21, 2021, 1:46 AM IST

జీఎస్టీ అధికారి బొల్లినేని శ్రీనివాస్ గాంధీని సీబీఐ అరెస్టు చేసింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న అభియోగంపై 2019లో గాంధీపై సీబీఐ కేసు నమోదు చేసింది. అప్పట్లో గాంధీకి చెందిన ఇళ్లు, కార్యాలయాలపై సీబీఐ అధికారులు సోదాలు జరిపి పలు ఆధారాలు సేకరించారు.

నిన్న సాయంత్రం గాంధీని అరెస్టు చేసిన సీబీఐ అధికారులు ఇవాళ కోర్టులో హాజరు పరచనున్నారు. బీఎస్ గాంధీ ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ అసిస్టెంట్ డైరెక్టర్​గా ఉన్నప్పుడు జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తు అధికారిగా వ్యవహరించారు. జగన్​తో ఆ కేసుల్లో నిందితులుగా ఉన్న పలువురి ఆస్తుల జప్తులో క్రియాశీలకంగా వ్యవహరించారు.

ఇదీ చూడండి: వాలంటీరే.. అప్పుడప్పుడు ఉన్నతాధికారుల్లా అవతారమెత్తుతాడు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.