Strike Notice: గ్రామపంచాయతీ ఉద్యోగులు సమ్మెసైరన్ మోగించారు. అక్టోబరు 2 నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు పంచాయతీ ఉద్యోగుల సంఘం 9 ప్రధాన డిమాండ్లతో పంచాయతీరాజ్ కమిషనర్‌కు సమ్మె నోటీసు పంపింది. వేతన బకాయిలు చెల్లిచాలని, పంచాయతీ కార్మికులు, గ్రీన్ అంబాసిడర్‌లకు 20 వేల రూపాయల కనీస వేతనం చెల్లించాలని పేర్కొన్నారు. నెలకు 6 వేలు రూపాయల చొప్పున ఆక్యుపేషనల్ హెల్త్ అలవెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రక్షణ పరికరాలు, ఏకరూపదుస్తులు సకాలంలో అందించాలని, ప్రమాదంలో చనిపోయిన కార్మికులకు 10 లక్షల, సాధారణ మృతికి5 లక్షల రూపాయలు ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు.
ఇవీ చదవండి: