ETV Bharat / city

'వీలుంటే పంచాయతీ.. లేకుంటే పురపాలిక' - ఏపీ పంచాయతీ, పురపాలక ఎన్నికలకు సంబంధించిన వార్తలు

రాష్ట్ర ప్రభుత్వం వీలును బట్టి పంచాయతీ లేదా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తోంది. పంచాయతీ ఎన్నికలకు న్యాయపరంగా చిక్కులు ఎదురైతే వెంటనే పురపాలిక ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంది. దీనికి సంబంధించి పురపాలక శాఖ అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

'వీలుంటే పంచాయతీ.. లేకుంటే పురపాలిక'
'వీలుంటే పంచాయతీ.. లేకుంటే పురపాలిక'
author img

By

Published : Dec 29, 2019, 5:32 AM IST

పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నిర్ణయించిన రిజర్వేషన్లపై న్యాయ పరంగా చిక్కులు ఎదురైతే వెంటనే పురపాలిక ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలన్న ఆదేశాలతో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ తదుపరి చర్యలు తీసుకుంటోంది. వివిధ పురపాలక, నగరపాలక సంస్థల్లో వార్డులు, డివిజన్ల పునర్విభజన ప్రక్రియను వచ్చే నెల 20లోగా అధికారులు పూర్తి చేయనున్నారు.

2011 లెక్కల ప్రకారం ఓటర్ల గుర్తింపు

జులై 2తో పట్టణ, స్థానిక సంస్థల్లో పాలకవర్గ పదవీకాలం ముగిసింది. ఆలస్యంగా ఎన్నికలు నిర్వహించిన కాకినాడ నగర పాలక సంస్థలో ప్రస్తుతం పాలక వర్గం ఉంది. మిగతా 109 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికల కోసం 2011 జనాభా లెక్కల ప్రకారం ఓటర్ల జాబితాల తయారీతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్లను గుర్తించారు.

ముసాయిదా ప్రకటన జారీ

రాష్ట్రంలో 70కి పైగా పురపాలక, నగరపాలక సంస్థల్లో వార్డులు, డివిజన్ల పునర్విభజన ప్రక్రియ పూర్తైంది. వార్డు, డివిజన్ విస్తీర్ణం, వీటిలో జనాభా, ఓటర్ల సంఖ్య ఒకే తరహాలో ఉండాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. ఈ ప్రక్రియతో అత్యధిక పట్టణ, స్థానిక సంస్థల్లో వార్డులు, డివిజన్ల సంఖ్య పెరుగుతోంది. పురపాలక, నగరపాలక సంస్థల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి ముసాయిదా ప్రకటన జారీ చేస్తోంది. గత నెల రోజుల వ్యవధిలో 50కి పైగా పట్టణ, స్థానిక సంస్థల నుంచి వచ్చిన ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించింది. వీటిపై ఆయా పురపాలక, నగరపాలక సంస్థలు ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి తుది ప్రకటన చేయనున్నాయి.

విజయవాడకు హోదా

విజయవాడ నగరపాలక సంస్థకు మహా హోదా కల్పించే విషయాన్ని పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఉన్న ప్రతిపాదనలపై ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకొని తదుపరి చర్యలు తీసుకోనున్నారు. నగరం చుట్టూ ఉన్న కొన్ని గ్రామాలను విలీనం చేసి మహా విజయవాడ నగర పాలక సంస్థను ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి అధికారులు నివేదిక సిద్ధం చేస్తున్నారు.

మహా విశాఖలో కొత్త ప్రాంతాల కలయిక

మహా విశాఖలో ఇప్పటికే విలీనం చేసినా వివిధ కారణాలతో ఆచరణకు నోచుకోని కొత్త ప్రాంతాలను కలుపుతూ జీవీఎంసీ తాజాగా సర్కారుకు ప్రతిపాదనలు పంపింది. భీమునిపట్నం, అనకాపల్లి పురపాలక సంఘాలతో పాటు ఈ రెండు మండలాల్లోని మరో పది పంచాయతీలను చేర్చి వార్డుల సంఖ్యను 72 నుంచి 98కి పెంచుతున్నారు. భీమునిపట్నం మండలంలో ఐదు పంచాయతీల విలీనానికి గతంలో సర్పంచులు ససేమిరా అనడం వల్ల అధికారులు పక్కన పెట్టారు. ఇప్పుడున్న ప్రత్యేక అధికారుల ఆమోదంతో జీవీఎంసీలో విలీనం చేస్తున్నారు. ప్రభుత్వం అంగీకరిస్తే అధికారులు తదుపరి చర్యలు తీసుకోనున్నారు.

ఇదీ చూడండి:

తెలుగు భాషపై ఫ్రాన్స్ దేశస్థుడి మమకారం..!

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.