ETV Bharat / city

పంచాయతీలకు మళ్లీ షాక్‌.. పీడీ ఖాతాల్లోకే ఆర్థిక సంఘం నిధులు - పీడీ ఖాతా

FUNDS DIVERSION : పంచాయతీలకు.. రాష్ట్ర ప్రభుత్వం మరోసారి షాక్‌ ఇచ్చింది. 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయాలంటూ సర్పంచ్‌లు గగ్గోలు పెడుతున్నా.. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను.. మళ్లీ పీడీ ఖాతాల్లోకే బదిలీ చేసేలా ఆదేశాలిచ్చింది. విద్యుత్తు ఛార్జీల కింద 379.34 కోట్లు మళ్లించుకునేందుకు ఏర్పాట్లు చేసింది. కేంద్రం మరో 569 కోట్లు కేటాయించగా.. వాటి వినియోగంపైనా సందేహాలు నెలకొన్నాయి.

FUNDS DIVERSION
FUNDS DIVERSION
author img

By

Published : Oct 8, 2022, 8:09 AM IST

పంచాయతీలకు మళ్లీ షాక్‌.. పీడీ ఖాతాల్లోకే ఆర్థిక సంఘం నిధులు

FUNDS DIVERSION : పంచాయతీల పేర్లతో తెరిచిన బ్యాంకు ఖాతాల్లో ఆర్థికసంఘం నిధులు జమ చేయాలంటూ సర్పంచులు రోడ్లెక్కి ఆందోళనలు చేస్తున్నా.. రాష్ట్ర సర్కారు పట్టించుకోలేదు. నిధుల్లేక గ్రామాల్లో ఎలాంటి పనులూ చేయలేకపోతున్నామని గగ్గోలు పెడుతున్నా, భిక్షాటనలు చేస్తున్నా కనికరించలేదు. పంచాయతీ, జిల్లా, మండల పరిషత్తుల పర్సనల్‌ డిపాజిట్‌-పీడీ ఖాతాల్లోనే యథావిధిగా మళ్లీ ఆర్థిక సంఘం నిధులు జమ అయ్యేలా.. ఆదేశాలిచ్చింది.

రూ.379కోట్ల 34 లక్షల నిధులకు సంబంధించి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ పేరుతో గత నెల 28న విడుదలైన ఉత్తర్వులు.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. పంచాయతీ, జిల్లా, మండల పరిషత్తుల వారీగా కేటాయించిన నిధులన్నీ.. పీడీ ఖాతాల్లో జమ అయ్యేలా.. బిల్లులను జిల్లా ఖజానా అధికారి ద్వారా డీపీవోలు ఆమోదింపజేయాలని కమిషనర్‌ ఆదేశించారు. పీడీ ఖాతాల్లో నిధులు వేయడం ద్వారా.. వీటిని పంచాయతీ విద్యుత్ ఛార్జీల బకాయిల కింద మరోసారి మళ్లించే అవకాశం.. రాష్ట్ర ప్రభుత్వానికి దక్కింది.

రెండు విడతలుగా రూ.948కోట్లు : గత ఆగస్టులో 379 కోట్ల 34 లక్షలు విడుదల చేసిన కేంద్రం.. తర్వాత మరో 15 రోజుల్లో 569 కోట్లు విడుదల చేసింది. ఆ నిధులు ఇప్పుడు ఏమవుతాయన్నది.. ప్రశ్నార్థకంగా ఉంది. వీటిని ఆయా స్థానిక సంస్థల బ్యాంకు ఖాతాల్లో వేయాలా..? పీడీ ఖాతాల్లోనే జమ చేయాలా..? అనేది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంది. కేంద్ర ప్రభుత్వం గత రెండు నెలల్లో రెండు విడతలుగా.. మొత్తం రూ.948 కోట్ల 34 లక్షల ఆర్థిక సంఘం నిధులను గ్రామ పంచాయతీలకు విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం నిధులు..గ్రామ పంచాయతీలకు నేరుగా జమ అయ్యేలా బ్యాంకు ఖాతాలను కేంద్ర ప్రభుత్వం తెరిపించింది.

ఆర్థిక సంఘం నిధుల్లో పంచాయతీలకు 70శాతం, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లకు చెరో 15శాతం చొప్పున ఇవ్వాలి. కానీ ఈ నిధులన్నీ మళ్లీ రాష్ట్ర ఆర్థికశాఖ ఆధ్వర్యంలోని సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ-CFMSకు అనుసంధానించిన గ్రామ పంచాయతీల పీడీ ఖాతాలకు జమ అయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం కొద్ది రోజులుగా ఏర్పాట్లు చేయడంతో.. సర్పంచులు ఆందోళనలు చేస్తున్నారు. పంచాయతీల బ్యాంకు ఖాతాలకు.. ఆర్థిక సంఘం నిధులు జమ చేయాలని వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేస్తున్నారు.

అయినా.. ఒక విడత విడుదలైన 379.34 కోట్ల ఆర్థిక సంఘం నిధులు.. ఆయా పీడీ ఖాతాల్లో జమ అయ్యేలా పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్‌ కోన శశిధర్‌ పేరుతో..గత నెల 28న ఉత్తర్వులు వెలువడ్డాయి. అక్టోబరు 1 నుంచి 14 వరకూ.. రెండు వారాలపాటు వ్యక్తిగత కారణాలతో శశిధర్‌ సెలవులో వెళ్లారు. ఆయన స్థానంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ -సెర్ప్‌ CEO ఇంతియాజ్‌కి పీఆర్‌ కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ గత నెల28నే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.