Government Has Stopped Merging Schools: ప్రాథమిక పాఠశాలల నుంచి 3,4,5 తరగతులను తరలించడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్రస్థాయిలో ఆందోళనలు నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలూ పాఠశాలల విలీనాలపై వినతిపత్రాలు సమర్పించారు. క్షేత్రస్థాయి నుంచి వ్యతిరేకత రావడంతో చివరికి ఫిర్యాదుల పరిశీలనకు చర్యలు చేపట్టారు. జిల్లాలో సంయుక్త కలెక్టర్ అధ్యక్షతన కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు సరిగా పరిశీలించలేదని మంత్రి బొత్సకే ఫిర్యాదులు రాగా..మరోసారి పరిశీలించాలని ఆయన ఆదేశించారు. కొన్నిచోట్ల తిరిగి పరిశీలన చేయగా.. మరికొన్నిచోట్ల యథావిధిగానే జాబితాలను ఆమోదించారు.
పాఠశాలల విలీనంపై ఎమ్మెల్యేలు, జిల్లా కమిటీల ద్వారా మొత్తం 1,399 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి. ఇందులో ఎమ్మెల్యేలు ఇచ్చినవి 820, జిల్లా కమిటీల నుంచి వచ్చినవి 579 ఉన్నాయి. ఎమ్మెల్యేలు ఇచ్చిన వాటిల్లో కనీసం సగం వాటిని పరిగణనలోకి తీసుకోలేదు. మొత్తం 820 బడులకు సంబంధించి వినతులు ఇవ్వగా 380చోట్ల మాత్రమే విలీన మినహాయింపునిచ్చారు. క్షేత్రస్థాయిలో తల్లిదండ్రులు, విద్యార్థుల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకునే ఎమ్మెల్యేలు లేఖలు సమర్పించారు. వాటిల్లో సగం వాటికి మాత్రమే విలీనం నుంచి విముక్తి లభించింది. జిల్లా కమిటీలకు వచ్చిన 579లో 269ని పరిగణనలోకి తీసుకున్నారు. మొత్తం 649 పాఠశాలల విలీనం నిలిపివేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిన నేపథ్యంలో ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు గడువును మార్పు చేశారు. గతంలో జులై నెలలో ఉన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా హేతుబద్ధీకరణ చేస్తామని పేర్కొన్నారు. ఇప్పుడు ఆగస్టు 31న బడుల్లో ఉన్న విద్యార్థులనే ప్రామాణికంగా తీసుకుంటామని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.
ఇవి చూడండి: