ETV Bharat / city

గణేశ్​ నిమజ్జనంలో అపశుృతి.. కుప్పకూలిన భారీ గణనాథుడు - తెలంగాణ తాజా వార్తలు

Ganesh idol collapsed : గణేశ్‌ నిమజ్జనోత్సవంలో అపశుృతి చోటు చేసుకుంది. నిమజ్జనానికి తీసుకువెళ్తుండగా... గణేశ్​ విగ్రహం కూలింది. 20అడుగుల మట్టి విగ్రహం రోడ్డుపై కూలడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

గణేశ్​ నిమజ్జనంలో అపశుృతి..
గణేశ్​ నిమజ్జనంలో అపశుృతి..
author img

By

Published : Sep 9, 2022, 11:17 AM IST

Ganesh idol collapsed: భాగ్యనగరం గణేశ్‌ నిమజ్జనోత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. వర్షానికి తడిసి నిమజ్జనానికి వెళ్తున్న గణేశ్‌ విగ్రహం కూలింది. ఈ ఘటన హిమాయత్‌నగర్‌లో జరిగింది. కర్మన్‌ఘాట్‌లోని టీకేఆర్‌ కళాశాల వద్ద నవజీవన్‌ ఫ్రెండ్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో 20 అడుగుల మట్టి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు నిమజ్జనానికి వెళ్తుండగా హిమాయత్‌ నగర్‌ బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌ వద్ద విగ్రహం కూలిపోయింది.

రాత్రి కురిసిన భారీ వర్షంతో పాటు దారిలో అక్కడక్కడ కేబులు వైరులతో పాటుగా చెట్టు కొమ్మలు విగ్రహానికి తగలడంతో ఒక్క సారిగా పడిపోయిందని నిర్వహకులు చెబుతున్నారు. ఈ ఘటన ఉదయం ఆరు గంటల 30 నిమిషాలకి జరగ్గా సకాలంలో వాటిని తరలించడానికి క్రేన్​ రాకపోవడంతో ట్రాఫిక్​కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అంతే కాకుండా ఇతర విగ్రహాల ఊరేగింపునకు అంతరాయం నెలకొంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.