ETV Bharat / city

Women SHO: హైదారాబాద్ నగర పోలీసు చరిత్రలో మొట్టమొదటిసారి... మహిళా ఎస్​హెచ్​వో - హోం మంత్రి మహమూద్​ అలీ

Women SHO: తెలంగాణలోని హైదారాబాద్ నగర పోలీసు చరిత్రలో మొట్టమొదటిసారిగా ఓ మహిళా పోలీసు అధికారి.. ఎస్​హెచ్​వోగా బాధ్యతలు స్వీకరించారు. సీఐ మధులతకు.. హోం మంత్రి మహమూద్​ అలీ, హైదరాబాద్​ సీపీ సీవీ ఆనంద్​​ బాధ్యతలు అప్పగించారు.

women police take charge as SHO in hyderabad
హైదారాబాద్ నగర పోలీసు చరిత్రలో మొట్టమొదటిసారి మహిళా ఎస్​హెచ్​వో
author img

By

Published : Mar 8, 2022, 4:38 PM IST

SHO: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మొట్టమొదటి మహిళా ఎస్​హెచ్​వో(SHO)గా సీఐ మధులత బాధ్యతలు స్వీకరించారు. హోం మంత్రి మహమూద్‌ అలీ, నగర సీపీ సీవీ ఆనంద్‌ సమక్షంలో.. లాలాగూడ పీఎస్‌ ఎస్​హెచ్​వోగా మధులత విధులు స్వీకరించారు. 2002 బ్యాచ్‌కు చెందిన మధులత.. పాతబస్తీ మహిళా పోలీస్‌ స్టేషన్‌లో సీఐగా గతంలో పనిచేశారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. హైదరాబాద్‌ పోలీసు చరిత్రలో తొలిసారి ఆమెకు ఎస్​హెచ్​వో బాధ్యతలు అప్పగించారు. మధులత మహిళా పోలీసులకు స్ఫూర్తిగా నిలవాలని సీపీ సీవీ ఆనంద్‌ సూచించారు. మహిళా పోలీసులు సవాళ్లను స్వీకరించాలన్నారు. ప్రభుత్వం మహిళలను అన్ని రంగాల్లో ముందుంచేందుకు కృషి చేస్తోందని హోంమంత్రి మహమూద్‌ అలీ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా.. సీఐ మధులతకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

ఇదీ చదవండి: CM Jagan: మహిళలకు 51 శాతం పదవులిచ్చిన ఏకైక రాష్ట్రం ఏపీనే: సీఎం జగన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.