ETV Bharat / city

దాతల ఔదార్యం... అన్నార్తుల కళ్లల్లో ఆనందం - ఆంధ్రప్రదేశ్​లో లాక్​డౌన్ ప్రభావం

రాష్ట్రవ్యాప్తంగా లాక్​డౌన్ నిబంధన కట్టుదిట్టంగా కొనసాగుతోంది. ప్రజలెవరూ బయటకు రాకుండా ఇళ్లకే పరిమితమయ్యారు. ఫలితంగా ఉపాధి కోల్పోయిన పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరి అవస్థలు గమనించి సహాయం చేసేందుకు కొందరు దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నారు. తమకు తోచినంత సహాయం చేస్తూ దాతృత్వాన్ని చాటుతున్నారు.

food-and-needs-distribution-for-poor-peoople-in-andhra-pradhesh
పేదలకు కూరగాయలు, బియ్యం అందజేస్తున్న దాతలు
author img

By

Published : May 3, 2020, 11:36 PM IST

కృష్ణా జిల్లాలో ...

ఉండి నియోజకవర్గంలోని పాందువ్వలో ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు ప్రతి ఆదివారం 850 కుటుంబాలకు కూరగాయలు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నారు. నేడు చింతలపాటి రాంబాబు సహకారంతో ప్రతి కుటుంబానికి బియ్యం, సరకులు అందజేశారు. కంభంపాడులో... జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పిలుపు మేరకు నియోజకవర్గ నేత బాడిశ మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఇంటింటికి కోడిగుడ్లు పంపిణీ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలన్న ఉద్దేశంతో గొడుగులతో సామాజిక దూరం పాటించారు.

నెల్లూరు జిల్లాలో..

ప్రజలకు పౌష్టికాహారం అందించాలన్న లక్ష్యంతో స్థానిక వైకాపా నేత కిషోర్ రెడ్డి రొయ్యలు పంపిణీ చేశారు. నెల్లూరులోని ధనలక్ష్మిపురంలో 700 కుటుంబాలకు రొయ్యలు, మాస్కులు, శానిటైజర్లు అందించారు. వెంకటగిరిలో పారిశుద్ధ్య కార్మికుల సేవలకు సంఘీభావంగా... వెంకటగిరి రాజావారి సేవాసమితి నిర్వాహకులు సామూహిక కూరగాయల మార్కెట్ ప్రాంగణంలోని చెత్తాచెదారాన్ని తొలగించారు. పారిశుద్ధ్య కార్మికుల సేవలను ప్రశంసించారు.

తూర్పుగోదావరి జిల్లాలో...

ప్రత్తిపాడు జాతీయ రహదారిపై డ్రైవర్లు, బాటసారులకు ఓ యువకుడు ఆకలి తీరుస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. డ్రైవర్లు, బాటసారుల ఆకలి తీరుస్తున్న ఆ యువకుడిని పలువురు ప్రశంసించారు. దేవీపట్నం మండలం పెనికలపాడులో గిరిజనులకు స్థానిక ఎమ్మెల్యే ధనలక్ష్మి కూరగాయలు పంపిణీ చేశారు. రాజానగరంలో జక్కంపూడి రామ్మోహన్​రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంటింటికీ కూరగాయలు అందజేశారు. లాక్​డౌన్​తో ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు.

విశాఖపట్నం జిల్లాలో ...

అనంతగిరి మండలంలోని పేదలకు యునిటైడ్ ఫాస్టర్స్ ఫెలోషిప్ ప్రతినిధులు సంజీవ్ కుమార్ ఆధ్వర్యంలో బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. లాక్​డౌన్​లో పేదల ఇబ్బందులు గమనించి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. అనకాపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటికి కోడిగుడ్లు పంపిణీ చేశారు. కాంగ్రెస్ నేత రమణి ప్రోత్సాహంతో 600 కుటుంబాలకు కోడిగుడ్లు అందజేశారు.

అనంతపురం జిల్లాలో...

పెనుకొండ ఆర్టీసీ డిపోలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ఎస్.ఆర్.ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. మండలంలోని గోనిపేట, గోనిపేట తండాలో నిరుపేదలు, వృద్ధులు, ఒంటరి మహిళలకు, దివ్యాంగులకు యూటీఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక ఉపాధ్యాయులు 18 రకాల నిత్యావసర సరకులు అందజేశారు.

విజయనగరం జిల్లాలో...

లాక్​డౌన్​తో ఇబ్బందులు పడుతున్న పేదలకు పాచిపెంట పోలీసులు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటిస్తూ కరోనా వ్యాప్తి నివారణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

శ్రీకాకుళం జిల్లాలో...

కవిటి మండలం మందరాడలో లాక్​డౌన్​తో ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న పేదలకు శ్రీ వావిలపల్లి వేణుగోపాల్ నాయుడు ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు, బియ్యం, కోడిగుడ్లు పంపిణీ చేశారు.

కర్నూలు జిల్లాలో...

కర్నూలు జిల్లా నంద్యాల మూడో పోలీస్ స్టేషన్​లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై వెంకటేశ్వర్లు తన సొంత ఖర్చులతో పేదలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు అందజేశారు.

ఇదీచదవండి.

మే 17 వరకు అన్నవరం స్వామివారి దర్శనం నిలిపివేత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.