ETV Bharat / city

చంద్రబాబు నివాసం వద్ద రక్షణ చర్యలు - flood

చంద్రబాబు నివాసానికి వరద ముప్పు పొంచి ఉంది. కృష్ణా నది ఒడ్డునే ఆయన నివాసం ఉన్నందున ముందు జాగ్రత్తగా ఇసుక బస్తాలతో అడ్డుకట్ట ఏర్పాటు చేశారు.

చంద్రబాబు నివాసం
author img

By

Published : Aug 14, 2019, 10:30 AM IST

Updated : Aug 14, 2019, 11:28 AM IST

అమరావతి కరకట్ట వైపున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటివద్ద రక్షణ చర్యలు చేపడుతున్నారు. కృష్ణా నది ఒడ్డున్న ఉన్న చంద్రబాబు నివాసం వైపు వరద వచ్చే అవకాశం ఉన్నందున ముందస్తుగా 6 వేల ఇసుక బస్తాలతో అడ్డుకట్ట వేశారు. ఇవాళ తెల్లవారుజ ాము నుంచి వరద పెరుగుతున్నందున ఆయన నివాసంలోని గ్రౌండ్​ఫ్లోర్​లో ఉన్న సామగ్రిని పైఅంతస్తుకు తరలించినట్లు తెలిసింది. చంద్రబాబు వాహన శ్రేణిని మంగళగిరి ఆత్మకూరు వద్ద ఉన్న హ్యాపీరిసార్ట్స్​కు చేర్చినట్లు సమాాచారం. ప్రస్తుతం చంద్రబాబు హైదరాబాద్​లో ఉన్నారు. చేతి నరం బెణికినందున వైద్యుల సూచన మేరకు హైదరాబాద్​లో విశ్రాంతి తీసుకుంటున్నారు.

అమరావతి కరకట్ట వైపున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటివద్ద రక్షణ చర్యలు చేపడుతున్నారు. కృష్ణా నది ఒడ్డున్న ఉన్న చంద్రబాబు నివాసం వైపు వరద వచ్చే అవకాశం ఉన్నందున ముందస్తుగా 6 వేల ఇసుక బస్తాలతో అడ్డుకట్ట వేశారు. ఇవాళ తెల్లవారుజ ాము నుంచి వరద పెరుగుతున్నందున ఆయన నివాసంలోని గ్రౌండ్​ఫ్లోర్​లో ఉన్న సామగ్రిని పైఅంతస్తుకు తరలించినట్లు తెలిసింది. చంద్రబాబు వాహన శ్రేణిని మంగళగిరి ఆత్మకూరు వద్ద ఉన్న హ్యాపీరిసార్ట్స్​కు చేర్చినట్లు సమాాచారం. ప్రస్తుతం చంద్రబాబు హైదరాబాద్​లో ఉన్నారు. చేతి నరం బెణికినందున వైద్యుల సూచన మేరకు హైదరాబాద్​లో విశ్రాంతి తీసుకుంటున్నారు.

Intro:Ap_cdp_46_14_kondalni chidimestunnaru_guttalni udchestunnaru_pkg_Ap10043
k.veerachari, 9948047582
కొండలు.. గుట్టలు...చెరువులు... కాలువలు ఇవన్నీ దేవుడు మనకు ప్రసాదించిన సహజసిద్ధమైన ప్రకృతి వనరులు. వీటిని కాపాడుకుంటూనే భవిష్యత్తు ఉంటుంది. వీటి పట్ల ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా భావితరాల భవిష్యత్ పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఒకప్పుడు సహజవనరులను ఎవరైనా ఆక్రమించిన, వాటికి నష్టం జరుగుతుందని భావించినా గ్రామ ప్రజలు తీవ్రంగా ప్రతిఘటించేవారు. ఇప్పుడు రాజకీయాలు చోటుచేసుకోవడంతో మనకెందుకులే అన్నట్లు నిశ్శబ్దంగా ఉండి పోతున్నారు. ఫలితంగా సహజ వనరులు స్వార్ధపరుల కారణంగా కరిగిపోతున్నాయి. ఒకప్పుడు తమ అవసరాలకు ఎక్కడో ప్రభుత్వ భూముల నుంచి మట్టిని తవ్వుకునేవారు. ఇప్పుడు గుట్టలపై కన్నేశారు. వాటిని కాదని మరో అడుగు ముందుకేసి కొండల్ని పిండి చేసే పనిలో పడ్డారు. అలాగని చెరువుని వదిలేశారా అనుకుంటే పప్పులో కాలేసినట్లే. వాటినీ చెరపట్టారు. చెరువులను నామరూపాలు లేకుండా చేస్తున్నారు. ఇంతా జరుగుతున్నా ఇటు భూగర్భ గనుల శాఖ అధికారులు గానీ, అటు రెవిన్యూ అధికారులు గానీ పట్టించుకున్న పాపాన పోలేదు. ఫలితంగా కడప జిల్లా రాజంపేట ప్రాంతంలో కొండలు, గుట్టలు, చెరువులు కరిగిపోతున్నాయి. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపారు. రాజంపేట పార్లమెంట్ జిల్లా అవుతుందని ప్రచారం చేస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిస్తున్నారు. చెరువులు కొండలు గుట్టల నుంచి తెచ్చిన మట్టితో పొలాలను చదువు చేసి స్థిరాస్తి వ్యాపారానికి నాంది పలికారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల స్వార్థానికి ఇటీవల గుట్టను తవ్వుతున్న హిటాచి డ్రైవర్ మట్టిపెళ్లలు విరిగిపడి మృతి పాలయ్యాడు.
* అసలే చుక్క నీరు లేక చెరువులు పూర్తిగా ఎండిపోయాయి. ఎక్కడా నీటి తడులు లేవు. రైతులు కూడా పంటలు సాగుకు చెరువుమట్టిని తరలించుకొనేందుకు ముందుకు రాలేదు. ఫలితంగా రైతులు గానీ అధికారులు గానీ చెరువుల గురించి పట్టించుకోలేదు. వాటి వంక కన్నెత్తి కూడా చూడలేదు. ఇదే అదనుగా భావించిన వ్యాపారులు చెరువులపై దృష్టిపెట్టారు. వ్యవసాయ భూములను ఇళ్ల స్థలాలుగా మార్చడానికి మట్టి అవసరం అవుతుంది. ఆ మట్టిని చెరువుల నుంచి ఇష్టానుసారంగా తవ్వేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా కొల్లగొట్టేస్తున్నారు. జెసిబి లు పెట్టి సర్వనాశనం చేస్తున్నారు. రాజంపేట మండలం మన్నూరు, పోలి చెరువుల్లో ఇదే పరిస్థితి నెలకొంది.
* రాజపేట మండలం రామాపురం చెక్పోస్ట్ వద్ద, పోలి, ఊటుకూరు తదితర ప్రాంతాల్లో స్థిరాస్తి వ్యాపారం చేస్తున్న వ్యాపారులు కొందరు ప్లాట్లు వేయడానికి భూమిని చదును చేస్తున్నారు. దీనికోసం మన్నూరు, పోలి చెరువులు నుంచి జెసిపి లు టిప్పర్లు పెట్టి ఇ మట్టిని తరలిస్తున్నారు. వాస్తవానికి చెరువుల నుంచి మట్టిని తీసుకు వెళ్లాలంటే నీటి పారుదల శాఖ అధికారుల నుంచి అనుమతి పొందాలి. కానీ నీ ఎలాంటి అనుమతి లేకుండానే అధికారులు అనుమతి ఇస్తే ఎంత ఇవ్వకపోతే ఎంత అన్నట్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులు పట్టపగలే చెరువులను సర్వనాశనం చేస్తున్నారు. ఇదంతా జరుగుతున్నా చెరువు ఆయకట్టు రైతులు గానీ, చెరువు సంఘం నాయకులు గానీ పట్టించుకోలేదు. స్వార్థపరులను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. సంబంధిత శాఖ అధికారులు కూడా ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
* రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూ బకాసురులు ఒకటి అయినట్లు కనిపిస్తోంది. వ్యాపారులు కొండలు గుట్టల ని తవ్వి మట్టిని తీసుకెళ్లడం వల్ల ఆ ప్రాంతం చదునుగా మారుతోంది అలా చదునుగా మారిన ఆ ప్రాంతాన్ని భూ బకాసురులు ఆక్రమించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. కొండలను సర్వ నాశనం చేస్తున్న కనీసం అటవీశాఖ అధికారులు కూడా స్పందించకపోవడం విశేషం
* చెరువులు, కొండలు, గుట్టల నుంచి మట్టిని తరలించడం చట్టవిరుద్ధమని అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని ఆర్డిఓ రామచంద్రారెడ్డి తెలిపారు.


Body:కొండల్ని చిదిమేస్తున్నారు.. గుట్టల్ని ఊడ్చేస్తున్నారు


Conclusion:కడప జిల్లా రాజంపేట
Last Updated : Aug 14, 2019, 11:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.