రాష్ట్రంలో కరోనా నియంత్రణకు ఐదుగురు మంత్రులతో పర్యవేక్షణ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కొవిడ్ నివారణకు పర్యవేక్షణ, వ్యాక్సినేషన్, కమాండ్ కంట్రోల్‌ను పర్యవేక్షణ చేయడానికి కమిటీ నియమించింది. కమిటీకి కన్వీనర్‌గా వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఉండగా.. సభ్యులుగా మంత్రులు బుగ్గన, సుచరిత, బొత్స సత్యనారాయణ, కన్నబాబు ఉంటారు.
ఈ నెల 22వ తేదీ ఉదయం 11గంటలకు మంత్రులు కమిటీ సమావేశం కానుంది. మంగళగిరిలోని ఏపీఐఐసీ బిల్డింగ్ 6వ ఫ్లోర్‌లోని కాన్ఫరెన్స్ హల్లో సమావేశం జరగనుంది. రాష్ట్రంలో కరోనా నియంత్రణకు తీసుకోవలసిన చర్యలు, ఆసుపత్రుల్లో కరోనా బాధితులకు అందుతున్న వైద్య సేవలపై చర్చించనున్నారు. కమాండ్ కంట్రోల్ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ సహా... పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు మంత్రుల కమిటీ తీసుకోనుంది.
ఇదీ చదవండీ... రాష్ట్రంలో కరోనా కల్లోలం..8,987 కేసులు, 35 మరణాలు