హైదరాబాద్ కూకట్‌పల్లి కేపీహెచ్బీ కాలనీలోని ఓ హార్డ్ వేర్ షాపులో ఈ రోజు తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రాందేవ్ ఎలక్ట్రికల్ అనే హార్డ్ వేర్ షాపులో మంటలు చెలరేగటంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎలక్ట్రికల్ ఉపకరణాలు, పెయింట్ డబ్బాలు, ఫ్లై వుడ్ ఉపకరణాలు ఉండటంతో మంటలు షాపులోని మూడు అంతస్తుల్లో మంటలు వ్యాపించాయి. అదే భవనం సీఎంఆర్ జ్యువెలరీ షాప్ కూడా ఉంది. జ్యువెలరీ షాప్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
అగ్నిమాపక సిబ్బంది ఐదు నీటి ట్యాంకర్లు ఉపయోగించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదం జరిగిన సమయంలో షాపులో వాచ్మెన్ కుటుంబ సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో ఒకరు అస్వస్థతకు గురికావటంతో స్థానికులు వారిని దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి: