కార్మిక బీమా సంస్థ ఈఎస్ఐలో పలు ఆర్థిక అవకతవకలు గుర్తించినట్లు విజిలెన్స్ విభాగం వెల్లడించింది. 2014-19 మధ్య జరిగిన కొనుగోళ్లకు సంబంధించి పలు పత్రాలను పరిశీలించిన అధికారులు... రూ.70 కోట్ల మేర అవినీతి జరిగిందని పేర్కొన్నారు. మొత్తం రూ.975 కోట్ల మేర ఔషధాలు, పరికరాలు, ఫర్నిచర్, ల్యాబ్ కిట్ల కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని నివేదిక సిద్ధం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 4 ఈఎస్‌ఐ ఆస్పత్రుల పరిధిలోని 78 ఈఎస్‌ఐ డిస్పెన్సరీలు, 3 డయాగ్నోస్టిక్ సెంటర్ల కోసం ఆయా కొనుగోళ్లు జరగ్గా.... పలు నిబంధనలను ఉల్లంఘించారని తేల్చారు. ముగ్గురు డైరెక్టర్ల పదవీకాలంలో ఈ అవకతవకలు జరిగాయన్న విజిలెన్స్ విభాగం... ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.
ఇదీ చదవండి :