గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 150 డివిజన్లకు గాను మొత్తం 1,122 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి లోకేశ్ కుమార్ ప్రకటించారు. గ్రేటర్లోని మొత్తం 150 స్థానాల్లో పోటీ చేస్తున్న ఏకైక పార్టీగా తెరాస నిలిచింది. ఎన్నికలు జరుగుతున్న అన్ని డివిజన్లలో తెరాస అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. నవాబ్సాహెబ్ కుంట డివిజన్లో తప్ప 149 స్థానాల్లో భాజపా అభ్యర్థులను బరిలో దించింది. కాంగ్రెస్ 146 స్థానాలు, ఎంఐఎం 51 స్థానాలు, తెదేపా 106, సీపీఐ 17, సీపీఎం 12 డివిజన్లలో రంగంలో ఉన్నాయి.
76 మంది గుర్తింపు పొందిన పార్టీలకు చెందిన అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థులు 415 మంది తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఇక అత్యధికంగా జంగంమెట్ డివిజన్లో 20 మంది అభ్యర్థులు తలపడనున్నారు. అత్యల్పంగా 5 డివిజన్లలో ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఉప్పల్, బార్కస్, నవాబ్ సాహెబ్కుంట, టోలిచౌకి, జీడిమెట్లలో ముగ్గురేసి అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
క్ర.సం | పార్టీ పేరు | పోటీ చేస్తున్న డివిజన్ల సంఖ్య |
1. | తెరాస | 150 |
2. | భాజపా | 149 |
3. | కాంగ్రెస్ | 146 |
4. | ఎంఐఎం | 51 |
5. | తెదేపా | 106 |
6. | సీపీఐ | 17 |
7. | సీపీఎం | 12 |
8. | గుర్తింపు పొందిన పార్టీలు | 76 |
9. | స్వతంత్రులు | 415 |
మొత్తం | 1,122 |
ఇవీ చూడండి: