ETV Bharat / city

Students Return: బుకారెస్ట్ నుంచి దిల్లీ చేరుకున్న ఐదో విమానం... ఐదుగురు ఏపీ విద్యార్థులు - బుకారెస్ట్ నుంచి దిల్లీ చేరుకున్న ఐదో విమానం

TELUGU STUDENTS :బుకారెస్ట్​ నుంచి దిల్లీకి ఐదో విమానం చేరుకుంది. ఈ విమానంలో 249 మంది విద్యార్థులు ఉండగా... అందులో 16 మంది తెలుగు విద్యార్థులు ఉన్నారు. ఏపీ చెందినవారు అయిదుగురు ఉండగా.. తెలంగాణకు చెందిన వారు 11మంది ఉన్నారు.

బుకారెస్ట్ నుంచి దిల్లీ చేరుకున్న ఐదో విమానం

author img

By

Published : Feb 28, 2022, 10:26 AM IST

TELUGU STUDENTS: ఉక్రెయిన్‌లో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా.. మన దేశానికి చెందిన చాలా మంది విద్యార్థులు అక్కడే చిక్కుకుపోయారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారిని స్వదేశానికి తరలించే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇప్పటికే నాలుగు విమానాల ద్వారా విద్యార్థులను భారత్​కు రప్పించగా.. బుకారెస్ట్​ నుంచి దిల్లీకి ఐదో విమానం చేరుకుంది. ఈ విమానంలో 249 మంది విద్యార్థులు ఉండగా... అందులో 16 మంది తెలుగు విద్యార్థులు ఉన్నారు. ఏపీ చెందినవారు అయిదుగురు ఉండగా...తెలంగాణకు చెందిన వారు 11మంది ఉన్నారు. దిల్లీ నుంచి ఇద్దరు విద్యార్థులు తిరుపతికి బయలుదేరగా మరో విద్యార్థి సాయంత్రం విజయవాడకు చేరుకోనున్నాడు. మరో ఇద్దరు హైదరాబాద్​కు బయలుదేరారు.

Students Reached Vijayawada: 'మాకిది పునర్జన్మ' ఉక్రెయిన్ నుంచి చేరుకున్న విద్యార్థుల ఉద్వేగం

Students reached vijayawada: ఉక్రెయిన్‌ నుంచి మరి కొంతమంది తెలుగు విద్యార్థులు క్షేమంగా వారి స్వస్థలాలకు చేరుకున్నారు. విజయవాడ విమానాశ్రయానికి ఆదివారం ఉదయం ఇద్దరు విద్యార్థులు రాగా... సాయంత్రం 7 గంటలకు మరో నలుగురు చేరుకున్నారు. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన వైద్య విద్యార్థిని స్కందన హైదరాబాద్ చేరుకుంది. అక్కడినుంచి తమ స్వస్థలానికి అధికారులు క్షేమంగా తీసుకొచ్చారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులను చూసి ఒక్కసారిగా ఉద్వేగానికి లోనైయ్యారు.

కళ్లకు కట్టినట్లు వివరించారు..
దిల్లీ నుంచి బెంగుళూరు వచ్చిన మదనపల్లికి చెందిన విద్యార్థులను రెవెన్యూ అధికారులు దగ్గరుండి తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. ఉక్రెయిన్‌లోని పరిస్థితులను వారు కళ్లకు కట్టినట్లు వివరించారు. రాజధాని కీవ్​లో విమానాలు రాకపోకలు ఆపేయడంతో 250 మంది విద్యార్థులు 10 కిలోమీటర్లు నడుచుకుంటూ రాత్రిపూట మరో విమానాశ్రయానికి చేరుకున్నామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకారంపై కృతజ్ఞతలు తెలిపారు.

సొంత ఊరుకు రావడం పునర్జన్మ లాంటిది..
విపత్కర పరిస్థితులలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సొంత ఊరుకు రావడం పునర్జన్మ అని ఉక్రెయిన్ నుంచి వచ్చిన కడపకు చెందిన గౌతమి అన్నారు. తనతో పాటు తన స్నేహితులు కూడా వచ్చి ఉంటే మరింత సంతోషంగా ఉండేదని అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న మరికొంతమంది విద్యార్థులను క్షేమంగా తీసుకురావాలని తల్లిదండ్రులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చదవండి:

వాహనదారులకు గుడ్ న్యూస్.. ట్రాఫిక్‌ జరిమానాల రాయితీ రేపట్నుంచే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.