ETV Bharat / city

ప్రాంతీయ రింగ్​రోడ్డు మార్గ నిర్ణయానికి త్వరలో క్షేత్రస్థాయి సర్వే

author img

By

Published : Mar 13, 2021, 10:57 AM IST

తెలంగాణలో... ప్రాంతీయ రింగ్​రోడ్డు (ఆర్‌.ఆర్‌.ఆర్‌) మార్గ నిర్ణయం (అలైన్‌మెంట్‌) కోసం త్వరలో క్షేత్ర స్థాయి అధ్యయనం చేసేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఉత్తర భాగంలో 158 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి వీలుగా.. భూ సేకరణ చేసేందుకు కేంద్రం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.

RRR
RRR

ప్రాంతీయ రింగ్​రోడ్డు మార్గ నిర్ణయంపై తెలంగాణ ప్రభుత్వం వేగంగా కదులుతోంది. గూగుల్‌ మ్యాప్‌ ఆధారంగా రోడ్డు మార్గాన్ని రూపొందించింది. సంగారెడ్డి, మెదక్‌, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నల్గొండ, రంగారెడ్డి, వికారాబాద్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల మీదుగా ఈ రోడ్డు నిర్మించాల్సి ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచి రహదారి నిర్మించాలన్న అంశంపై అధ్యయనం చేసేందుకు రెవెన్యూ అధికారులతో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేయాలని జాతీయ రహదారుల సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది

అందుకోసం భూసేకరణ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ఇద్దరు ప్రత్యేకాధికారులతోపాటు జిల్లాల వారీగా తహసీల్దార్లను నియమించాలని కోరింది. ఆ మేరకు ఒక సీనియర్‌ అధికారితో పాటు ప్రతి జిల్లాకు ఇద్దరు, ముగ్గురు తహసీల్దార్లను నియమించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాల తర్వాత వీరిని ఖరారు చేయనున్నట్లు తెలిసింది.

ప్రభుత్వ పరిశీలనలో ఉన్న అంశాలు..

  • సహజ వనరులను యథాతథంగా కొనసాగించడం. చెరువులు, కొండలకు ఎలాంటి నష్టం జరగకుండా చూడటం.
  • ఎక్కడైనా గ్రామాల మధ్య నుంచి వెళ్లే పరిస్థితి ఉన్నా ప్రజల నివాసాలకు ఇబ్బంది రాకుండా చూడటం. అందుకు కొంత దూరం పెరిగినా ఆమోదించడం.
  • జంక్షన్లు, టోల్‌ప్లాజాలు తదితర ప్రాంతాల్లో కాస్త అటూఇటూ ఐనా ప్రతి కిలోమీటరుకు 25 నుంచి 30 ఎకరాల భూసేకరణ చేయడం.
  • నష్ట పరిహారం చెల్లింపు విధానాన్ని రూపొందించేందుకు త్వరలో సమీక్షించడం.
  • జాతీయ రహదారుల చట్టం- 1959 విధానంతోపాటు భూసేకరణకు ఆరు నెలల ముందు వరకు ఆయా ప్రాంతాల్లో జరిగిన భూ లావాదేవీలు, మార్కెట్‌ ధర, రిజిస్ట్రేషన్‌ ధరలను పరిశీలించిన మీదట ఎకరాకు ఎంత మొత్తంలో నష్టపరిహారం చెల్లించాలన్న అంశాన్ని ప్రభుత్వం ఖరారు చేస్తుందని రెవిన్యూ అధికారి ఒకరు ‘ఈనాడు’తో చెప్పారు.

ఇదీ చూడండి:

దూకుడుగా టాలీవుడ్.. 2022 బుక్ అవుతోంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.