అమరావతిపై వ్యతిరేకతతో కొందరు నాయకులు ఇన్నాళ్లూ విషప్రచారం చేశారని రాజధాని రైతులు మండిపడ్డారు. మూడు రాజధానుల నిర్ణయాలను వ్యతిరేకిస్తూ అమరావతిలో రైతులు, కూలీలు చేస్తున్న నిరసనలు మంగళవారం 399వ రోజు కొనసాగించారు. రైతుల దీక్ష బుధవారానికి 400వ రోజుకు చేరుకుటున్న సందర్భంగా ‘అమరావతి సంకల్ప ర్యాలీ’ నిర్వహించనున్నట్లు ఐకాస కన్వీనర్ పువ్వాడ సుధాకర్ తెలిపారు. తుళ్లూరులో ఉదయం 9 గంటలకు ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలతో ప్రారంభమయ్యే ర్యాలీ పెదపరిమి, నెక్కల్లు, వెలగపూడి గ్రామాల మీదుగా మందడం వరకు సాగనుందని చెప్పారు. అన్ని వర్గాల వారు పాల్గొనాలని ఆయన కోరారు.
ఇదీ చదవండి: