ETV Bharat / city

సమరావతి : 26వ రోజుకు రాజధాని రైతుల నిరసన - రాజధాని రైతుల నిరసన

పోలీసుల అణచివేత ధోరణిని లెక్కచేయకుండా అమరావతి కోసం ఉద్యమం ఉద్ధృతంగా సాగుతోంది. అమరావతి కోసం ప్రాణాలు వదిలేందుకైనా సిద్ధమని అన్నదాతలు తేల్చిచెబుతున్నారు. నిన్నటి పర్యటన వాయిదాపడడంతో నేడు జాతీయ మహిళా కమిషన్ ప్రతినిధిలు అమరావతిలో పర్యటించనున్నారు. వారికి అన్ని ఆధారాలు అందచేసేందుకు మహిళలు సిద్ధమయ్యారు.

రాజధాని రైతుల నిరసన
రాజధాని రైతుల నిరసన
author img

By

Published : Jan 12, 2020, 5:56 AM IST

Updated : Jan 12, 2020, 8:07 AM IST

రాజధాని రైతుల నిరసన

రాజధాని రైతుల పోరు 26వరోజుకు చేరింది. ఆందోళన ఉద్ధృతంగా సాగుతున్న తరుణంలో రాజధాని గ్రామాల్లో పోలీసులను భారీగా మోహరించారు. ఎవరూ బయటకు రావొద్దంటూ నిబంధనలను కఠినతరం చేశారు. అయితే మహిళలు, రైతులు మాత్రం తమ ఇళ్ల వద్ద, ఆలయాల్లో నిరసనలు కొనసాగిస్తున్నారు. దేవాలయానికి వెళ్లే వారిని కూడా పోలీసులు అడ్డుకుంటుండటంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. జాతీయ మహిళా కమిషన్ ప్రతినిధులు ఇవాళ రాజధాని ప్రాంతంలో పర్యటిస్తుండటంతో పోలీసుల నిర్బంధంపై వారి ముందు ఆధారాలు పెట్టాలని మహిళలు నిర్ణయించారు.

రైతుల్ని అరెస్ట్‌ చేసేందుకు పలుచోట్ల పోలీసులు ఇళ్లలోకి చొరబడటం ఉద్రిక్తతకు దారితీసింది. రహదారి దిగ్బంధం కేసులో ఉన్నారంటూ వెలగపూడిలోని ఓ ఇంట్లోకి పోలీసులు చొరబడ్డారు. ఇంటి తలుపులు పగలకొట్టే ప్రయత్నం చేశారు. మహిళలు వారిని అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వెనుతిరిగారు.

అరెస్టులను లెక్క చేయమని రైతులు తెగేసి చెప్తున్నారు. ఇప్పటివరకూ దాదాపు 15మంది చనిపోయారని...ఎన్ని ప్రాణాలు పోయినా ఉద్యమాన్ని ఆపేది లేదని తేల్చిచెప్తున్నారు.ఇవాళ కూడా మందడం, తుళ్లూరుల్లో మహాధర్నాలు కొనసాగనున్నాయి. పోలీసులు అడ్డుకుంటే ఇళ్లు, ఆలయాల వద్దే నిరసనలు కొనసాగిస్తామని మహిళలు చెబుతున్నారు.

ఇదీచదవండి

'సీఎం మారినప్పుడల్లా రాజధాని మారుస్తారా...?'

sample description
Last Updated : Jan 12, 2020, 8:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.