ETV Bharat / city

బక్కజీవిపై వరుస పిడుగులు.. ఏటా వెంటాడుతున్న విపత్తులు - వర్షాలతో రైతుల ఇబ్బందులు తాజా వార్తలు

Farmers problems: వాతావరణ మార్పులతో రైతులకు జరిగే నష్టం ఊహకందని స్థాయిలో ఉంటోంది. భారీవర్షాలు, వరదలతో రైతులు మూడేళ్లుగా నిలువునా మునిగారు. ఒక నెల వానలు ముఖం చాటేస్తే.. మరో నెలలో విరుచుకుపడుతున్నాయి. పెట్టుబడులు పెరిగి, గిట్టుబాటు ధరలు దక్కక రైతులు అప్పుల పాలవుతున్నారు. ఏ పంట వేసినా పెట్టుబడి కూడా దక్కట్లేదనే ఆవేదనతో ప్రాణాలు తీసుకుంటున్నారు.

Farmers problems due to calamities
Farmers problems due to calamities
author img

By

Published : Jul 14, 2022, 7:25 AM IST

Farmers problems: భారీవర్షాలు, వరదలతో రైతులు మూడేళ్లుగా నిలువునా మునిగారు. ఒక నెల వానలు ముఖం చాటేస్తే.. మరో నెలలో విరుచుకుపడుతున్నాయి. తీరా పంట చేతికొచ్చే సమయంలో ముంచేస్తున్నాయి. వాతావరణ మార్పులతో రైతులకు జరిగే నష్టం ఊహకందని స్థాయిలో ఉంటోంది. పెట్టుబడులు పెరిగి, గిట్టుబాటు ధరలు దక్కక రైతులు అప్పుల పాలవుతున్నారు. ఏ పంట వేసినా పెట్టుబడి కూడా దక్కట్లేదు.

నివర్‌ తుపాను రైతుల తలరాతల్నే మార్చేసింది. ఎకరా వరికి రూ.40వేలు పెట్టుబడి పెడితే.. బాగా పండితే తొలి పంటలో కౌలు చెల్లించడమే గగనమవుతోంది. వర్షాలు వస్తే.. అదీ ఉండదు. పత్తి, వేరుసెనగ దిగుబడులు రాకపోగా.. పశుగ్రాసానికీ మిగలట్లేదు. మిరపరైతులు గతేడాది ఎకరాకు రూ.లక్ష వరకు నష్టపోయారు. కందికీ తెగుళ్లే. గతేడాది పొగాకు మినహా.. రైతుకు అచ్చి వచ్చిన పంటలు పెద్దగా లేవు. పీఎం కిసాన్‌, రైతు భరోసా, పెట్టుబడి రాయితీ, పంటలబీమా వారికి ఆర్థిక భరోసా ఇవ్వలేకపోతున్నాయి.

అదనులో ముఖం చాటేస్తున్న వానలు.. అదునులో వర్షాల్లేక దిగుబడి అంతంతమాత్రంగా ఉంటోంది. పంట చేతికొచ్చే సమయంలో వానలు కుండపోతగా కురుస్తున్నాయి. అనంతపురం జిల్లాలో వర్షం అవసరమైన ఆగస్టులో 36% తక్కువగా వానలు పడ్డాయి. పంట చేతికొచ్చే సెప్టెంబరులో 141% అధికంగా కురిశాయి. చిత్తూరు జిల్లాలో 2020 జూన్‌లో సాధారణ వర్షపాతం కురవగా.. జులైలో 167% అధికంగా నమోదైంది. ఆగస్టులో ముఖం చాటేయడంతో వేరుసెనగ దిగుబడి తగ్గింది. పంట చేతికొచ్చే దశలో సెప్టెంబరులో ముంచేసింది.

  • పత్తి అధికంగా సాగయ్యే కర్నూలులో గతేడాది ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరులో లోటు వానలే. పత్తి చేతికొచ్చే నవంబరులో సాధారణం కంటే 240% అధికంగా వానలు కురిశాయి.

సాధారణం కంటే 482% అధికంగా వానలు.. 2021 నవంబరులో రాయలసీమ, గోదావరి జిల్లాలను వర్షాలు ముంచెత్తాయి. అనంతపురం జిల్లాలో సాధారణం కంటే 482% అధికంగా వానలు కురిశాయి. కడప జిల్లాలోనూ 320%, కర్నూలులో 241, చిత్తూరులో 174% అధిక వర్షపాతం నమోదైంది. 2020 జులైలో కర్నూలులో 103%, అనంతపురంలో 147% అధికంగా నమోదయ్యాయి. సెప్టెంబరులో కడపలో 171%, అనంతపురంలో 100%, కర్నూలు జిల్లాలో 113% చొప్పున అధికంగా వానలు కురిశాయి.

అకాల వర్షాలతో మునిగి.. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం కుంచవరానికి చెందిన తోట శ్రీనివాసరావు(34) దుగ్గిరాల మండలం ఈమనిలో ఏడు ఎకరాలు కౌలుకు తీసుకుని వరి, జొన్న, మొక్కజొన్న వేశారు. అకాల వర్షాలతో ధాన్యం దిగుబడి రాక.. జొన్న, మొక్కజొన్నలకు ధర సరిగా లేక కౌలు కూడా చెల్లించలేకపోయారు. రూ.8 లక్షల అప్పులయ్యాయి. రుణదాతల నుంచి ఒత్తిడి పెరిగి.. దిక్కుతోచక 2021 మార్చి 13న పురుగుమందు తాగి చనిపోయారు.

Farmers problems due to calamities
భర్త శ్రీనివాసరావు చిత్రపటం, పత్రాలతో పిల్లలతో కలిసి అంజలీదేవి

ఈ కుటుంబానికి పరిహారం అందలేదు. ‘ఏడేళ్ల బాబు, అయిదేళ్ల పాపతో మా పరిస్థితి దిక్కుతోచని విధంగా తయారైంది. బీమా సొమ్ముతోపాటు వాహనం అమ్మగా వచ్చిన రూ.38వేలు అప్పులకే ఇచ్చాం. ఇంకా రూ.7.40 లక్షలు అప్పు ఉంది. ఏం చేయాలో తెలియడం లేదు’ అని అంజలీదేవి వాపోయారు.

గిట్టుబాటు ధర దక్కక.. కూలి పనులు చేస్తూనే.. అయిదెకరాలు కౌలుకు తీసుకుని వేరుసెనగ, వరి సాగు ప్రారంభించిన వైయస్‌ఆర్‌ జిల్లా కమలాపురం మండలం వై.కొత్తపల్లె ఎస్సీ కాలనీకి చెందిన రవిశేఖర్‌కు గిట్టుబాటు ధర దక్కలేదు.

Farmers problems due to calamities
కుటుంబసభ్యులతో రవిశేఖర్

చివరకు రూ.రూ.1.50 లక్షల అప్పులు మిగిలాయి. వాటిని తీర్చలేక.. పొలంలోనే పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. అతడి భార్య ఈశ్వరమ్మ కూలి పనులకు వెళ్లి ముగ్గురు కొడుకులను పోషిస్తోంది. పరిహారం కోసం అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయిందని ఆమె వాపోయింది.

ధరల్లేక.. అప్పుల పాలై.. రాళ్లు కొట్టి జీవనం సాగించే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం దురదకుంట గ్రామానికి చెందిన వడ్డే హనుమంతరాయుడు (40).. టమోటా సాగుకు నాలుగెకరాలు కౌలుకు తీసుకున్నారు. పొలంలో నీటివసతి లేకపోవడంతో రూ.2 లక్షలతో 4 బోర్లు తవ్వించారు. అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టారు. దిగుబడి బాగున్నా.. ధరలు అనుకూలించక నష్టపోయారు.

Farmers problems due to calamities
హనుమంతరాయుడు ఫోటోతో.. భార్య లలితమ్మ, పిల్లలు

అప్పులు తీర్చలేని నిస్సహాయ స్థితిలో 2022 జనవరి 19న ఉరేసుకుని చనిపోయారు. భార్య లలితమ్మ, ఇద్దరు పిల్లలు దిక్కులేనివారిగా మిగిలారు. ప్రభుత్వసాయం కోసం దరఖాస్తులు చేసుకున్నా ఫలితం దక్కలేదు. దీంతో పిల్లల్ని పోషించడానికి లలితమ్మ రాళ్లు కొట్టే పనినే ఎంచుకున్నారు.

పెరిగిన పెట్టుబడులు.. మూడేళ్లుగా ఎరువులు ధరలు పెరిగాయి. 28.28.0, 14.35.14 రకాల ఎరువుల బస్తా కొనాలంటే రూ.1,900 చెల్లించాలి. రూ.975 ఉండే 20.20.0 రకం ఎరువుల బస్తా రూ.1500 వరకు చేరింది. సేద్యపు ఖర్చుల నుంచి.. విత్తనాలు, పురుగుమందులు అన్నీ పెరిగాయి. విపత్తులతో రైతు ఆదాయం పడిపోయింది. కౌలుకు తీసుకుని ఎకరాకు రూ.లక్ష పెట్టుబడి పెట్టిన మిరపను కాయ కూడా కోయకుండా వదిలేశారు. ఎరువుల దుకాణాల్లో అప్పులు పేరుకుపోయాయి.

పంటలు నీటిపాలై.. రూ.వేల కోట్ల నష్టం.. వరి, వేరుసెనగ పంట చేతికందే సమయంలో భారీవర్షాలు, వరదలు విరుచుకుపడటంతో రైతులు నష్టపోయారు. పత్తిలో గులాబీ పురుగు, మిరపలో నల్లతామర విజృంభించాయి.

  • 2020 ఆగస్టు నుంచి అక్టోబరు వరకు కురిసిన భారీవర్షాలు, వరదలకు ప్రభుత్వ లెక్కల ప్రకారమే రాష్ట్రంలో 8.24 లక్షల మందికి చెందిన 19.25 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతినగా.. 8 లక్షల టన్నుల ఉత్పత్తి నష్టపోయారు. రైతులు రూ.2,601 కోట్లు నష్టపోయారు.
  • 2021 నవంబరులో కురిసిన కుండపోత వానలకు 12.22 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతినగా 10 లక్షల టన్నుల ఉత్పత్తి నష్టం జరిగింది. రైతులు రూ.2,779 కోట్ల నష్టాన్ని చవిచూశారు. గతేడాది మిరప సాగు చేసిన రైతులు నల్లతామర కారణంగా ఎకరాకు రూ.లక్ష నష్టపోయారు. సాగుదారుల్లో 75% మంది అప్పులతో మిగిలారు.

గిట్టుబాటు ధర ఎక్కడ?.. పంటలకు గిట్టుబాటు ధర అంతంతమాత్రమే. ప్రభుత్వ లెక్కల్లో మాత్రం ప్రతి రైతుకూ మద్దతు ధర దక్కినట్లే రాస్తారు. ధాన్యం బస్తా రూ.1,455 చొప్పున కొనాల్సి ఉంటే.. రైతుకు దక్కేది సగటున రూ.1,200 మాత్రమే. మిగిలినది వ్యాపారులు, దళారుల జేబుల్లోకి వెళ్తోంది. ఎకరాకు 20 బస్తాలు వస్తే ధరలో తేడా రూపంలోనే రైతు రూ.5వేల వరకు నష్టపోతున్నారు. పసుపు మద్దతు ధర రూ.6,850 ఉంటే.. మార్చి, ఏప్రిల్‌ నుంచి క్వింటాలుకు సగటున రూ.5వేల ధరకే అమ్ముకున్నారు.

Farmers problems due to calamities
రైతులకు అప్పులు పెరగటానికి ప్రధాన కారణాలు

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.