ETV Bharat / city

PRAWNS: అయ్యో.. రొయ్య..పెట్టుబడులు పెరిగి, ధర తగ్గడంపై ఆవేదన..! - రొయ్య ధర తగ్గడంపై రైతుల ఆవేదన

PRAWNS: ఆక్వాలో దాణా ఖర్చు పెరిగింది. విద్యుత్తు బిల్లులూ తడిసిమోపెడవుతున్నాయి. మరోవైపు జనవరి నుంచి రొయ్యల ధరలు కిలోకు రూ.200 వరకు తగ్గాయి. గత 20 రోజుల్లోనే ధర రూ.90 వరకు పడిపోవడంతో సాగు చేయాలా? మానాలా? అని ఆక్వా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

PRAWNS
అయ్యో.. రొయ్య..పెట్టుబడులు పెరిగి, ధర తగ్గడంపై ఆవేదన.
author img

By

Published : Jun 7, 2022, 8:32 AM IST

PRAWNS: ఆక్వాలో దాణా ఖర్చు పెరిగింది. విద్యుత్తు బిల్లులూ తడిసిమోపెడవుతున్నాయి. మరోవైపు జనవరి నుంచి రొయ్యల ధరలు కిలోకు రూ.200 వరకు తగ్గాయి. గత 20 రోజుల్లోనే ధర రూ.90 వరకు పడిపోవడంతో సాగు చేయాలా? మానాలా? అని ఆక్వా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట సాగు ప్రారంభంలో చూపే ధరలకు.. చేతికొచ్చే సమయంలో ఇచ్చేదానికీ పొంతన ఉండటం లేదని, కావాలనే రేటు తగ్గిస్తున్నారని వాపోతున్నారు. ఇలాగైతే పంట విరామమే ప్రత్యామ్నాయమని ఆక్వా రైతు సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు. ధరల నిర్ణయంలో ఎంపెడా, మత్స్యశాఖ అధికారుల పాత్ర నామమాత్రంగా ఉందనే రైతులు విమర్శిస్తున్నారు.

కిలో రూ.600 నుంచి తగ్గుతూ

ఈ ఏడాది జనవరిలో 30 కౌంట్‌ రొయ్య ధర కిలో రూ.600 వరకు ఉంది. తర్వాత క్రమంగా తగ్గుతూ.. ప్రస్తుతం రూ.400 స్థాయికి చేరింది. సగటున కిలో రూ.200 తగ్గింది. 50 కౌంట్‌ రొయ్యలకు కూడా ఇప్పుడు రూ.300 మాత్రమే దక్కుతోంది. పరిశ్రమలకు విద్యుత్తు కోతల అమలు సమయంలో కూడా వ్యాపారులు రొయ్యల ధరలను సగటున కిలోకు రూ.50 వరకు తగ్గించారు. తర్వాత కిలోకు రూ.30 నుంచి రూ.40 వరకు పెంచినా.. మళ్లీ తగ్గుదల మొదలైంది. 50, 60 కౌంట్‌ రొయ్యలను అడగటం లేదని.. బతిమాలితే ధర తగ్గించి కొంటున్నారని రైతులు చెబుతున్నారు. ఎంపెడా, మత్స్యశాఖ అధికారుల నియంత్రణ కొరవడటంతో ధరలు ఇష్టారాజ్యంగా తగ్గించేస్తున్నారని పలువురు రైతులు మండిపడుతున్నారు. ఇరవై రోజుల వ్యవధిలోనే 30 కౌంట్‌ రొయ్య ధర రూ.510 నుంచి రూ.420కి పడిపోయిందని తూర్పుగోదావరి జిల్లా చెయ్యేరు రామలింగేశ్వర ఆక్వా వెల్ఫేర్‌ సొసైటీ అధ్యక్షుడు నాగభూషణం పేర్కొన్నారు. సగటున టన్నుకు రూ.లక్షకు పైగా నష్టపోతున్నామని వాపోయారు. రైతులు కిలో రొయ్యల ఉత్పత్తికి సగటున రూ.300 వరకు ఖర్చు చేస్తున్నారు. అమ్మకం ద్వారా సగటున (అన్ని రకాల కౌంట్‌ కలిపి) కిలోకు రూ.250 నుంచి రూ.270 మాత్రమే వస్తోంది. కిలోకు రూ.40 చొప్పున నష్టపోతున్నామని ఒంగోలుకు చెందిన రైతు హరిబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

పెరిగిన పెట్టుబడి ఖర్చులు

ఆక్వా రైతులకు విద్యుత్తు భారం పెరిగింది. గతంలో యూనిట్‌కు ఛార్జీ రూ.1.50 ఉండగా.. ఇప్పుడు రూ.4 చొప్పున చెల్లించాల్సి వస్తోంది. ఆక్వా జోన్లలో సాగు చేసే వారికి పదెకరాల వరకే రాయితీని పరిమితం చేయడంతో పలువురు రైతులకు రూ.లక్షల్లో బిల్లులు వస్తున్నాయి. రొయ్యల దాణా ఖర్చూ భారీగా పెరిగింది. 2021 ఆగస్టుతో పోలిస్తే కిలోకు రూ.17 చొప్పున అధికమైంది. ప్రభుత్వ ఆదేశాలతో కిలోకు రూ.2 చొప్పున తగ్గించారు. రొయ్యల చెరువుల్లో వాడే రసాయనాల ధరలు కూడా భారీగానే పెరిగాయి.

రెండు పంటల నుంచి ఒక పంటకు

ఆక్వా నష్టాలతో రైతులు ఇప్పటికే పునరాలోచనలో పడుతున్నారు. రెండు పంటలు వేసేవారు ఒక పంటకే పరిమితమవుతున్నారు. ఇప్పుడు అదీ నష్టాలే మిగులుస్తోంది. లీజులు తీసుకున్నవారు చెరువుల్ని వదిలేసి పోతున్నారు. ఉత్పత్తిదారుల్ని నిర్లక్ష్యం చేస్తే.. రైతులే కాకుండా, అనుబంధ పరిశ్రమల భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందని భారత రొయ్య రైతుల సమాఖ్య అధ్యక్షుడు మోహన్‌రాజు పేర్కొన్నారు. రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని ఆందోళన వెలిబుచ్చారు.

గ్రాముల లెక్కన కొనుగోలు విధానం పెడితేనే

ప్రస్తుతం 43 గ్రాముల బరువైన రొయ్య వస్తే.. 50 కౌంట్‌గా లెక్కవేస్తున్నారు. 40 కౌంట్‌, 50 కౌంట్‌ రొయ్యల ధర తేడా కిలోకు రూ.100 వరకు ఉంది. అంటే టన్నుకు రూ.లక్ష మేర నష్టపోతున్నారు. అలా కాకుండా.. 43 గ్రాములకు ఎంత ధర వస్తే అంతే చెల్లించే విధానం అమలు చేయాలని రైతులు కోరుతున్నారు. గుజరాత్‌, పశ్చిమబెంగాల్‌లో ఈ విధానం ఉందని.. ఆక్వా సాగులో అగ్రస్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ విధానం అమలు చేయాలని రైతులు కోరుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.