ETV Bharat / city

'కంకర, ఇసుక తరలింపులో.. పోలీసుల పాత్రపై విచారణ చేపట్టండి'

రాజధానిలో కంకర, ఇసుక మట్టి తరలింపులో పోలీసుల పాత్రపై విచారణ చేయాలంటూ తుళ్లూరు పోలీసు స్టేషన్ వద్ద అమరావతి రైతులు ఆందోళన నిర్వహించారు. రాజధానిలో అక్రమంగా ఇసుక, కంకర తరలిస్తున్న వ్యక్తులతో ఓ పోలీసు అధికారి మాట్లాడిన సంభాషణ బయటకు రావడంపై.. రైతులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమార్కులతో చేతులు కలిపిన పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ తుళ్లూరు స్టేషన్ వద్ద ఆందోళన నిర్వహించారు.

ఆందోళన చేస్తున్న రైతులు
ఆందోళన చేస్తున్న రైతులు
author img

By

Published : Aug 12, 2021, 4:46 PM IST

Updated : Aug 13, 2021, 4:25 AM IST

ఓ పోలీసు అధికారికి.. ప్రజాప్రతినిధి బంధువుగా భావిస్తున్న ఇంటి యజమానికి మధ్య జరిగిన సంభాషణ రాజధాని ప్రాంతంలో ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. ‘సర్‌ ఒక్క ట్రిప్పుతోనే అడ్డుకున్నారు.. ఇప్పుడు తోలుకోనా’ అని ఇంటి యజమాని అడగడం.. ‘ఇప్పుడొద్దు కాస్త లేట్‌గా 12-3 గంటల మధ్య చేసుకో’ అని అధికారిగా భావిస్తున్న వ్యక్తి చెప్పిన ఆడియో గురువారం సామాజిక మాధ్యమంలో వైరల్‌ అయింది. అందులోని సంభాషణను బట్టి రాజధాని ప్రాంతంలో మట్టి అక్రమ తవ్వకాలకు పోలీసు అధికారి ఒకరు అనుమతిస్తున్నారని అమరావతి రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. తుళ్లూరు శిబిరం నుంచి రైతులు, మహిళలు ఐకాస జెండాలు పట్టుకుని స్థానిక పోలీసు స్టేషన్‌ వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ నిరసన తెలియజేశారు.

ఆందోళన చేస్తున్న రైతులు

అమరావతిలో మట్టి దొంగలను వెంటనే అరెస్టు చేయాలని, ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని నినాదాలు చేశారు. స్థానికంగా ఇటీవల ఇనుము, ఇసుక, మట్టి, కంకర తరలించుకుపోయారు. వీటిని పోలీసులు తీవ్రంగా పరిగణించటం లేదని తప్పుబట్టారు. రాజధానిలో చోటుచేసుకుంటున్న ఈ తరహా అక్రమాలపై రెండేళ్లుగా ఎన్ని ఫిర్యాదులు చేసినా సరైన స్పందన లేదన్నారు. శాంతియుతంగా నిరసనలు చేస్తున్న తమ చుట్టే వేల సంఖ్యలో పోలీసులను మోహరిస్తున్న అధికారులు, నిర్మాణ సామగ్రి దొంగలపాలవుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని నిలదీశారు. అనుమతులు ఉన్న రీచ్‌ల నుంచే ఇసుక తరలిస్తున్నారని పోలీసులు చెప్పగా, దానికి రైతులు అభ్యంతరం తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా కంకర, మట్టిని తరలిస్తున్నారని సంబంధిత టిప్పర్లు, ట్రాక్టర్లను తామే పట్టిస్తామని, చర్యలు తీసుకుంటారా అని ప్రశ్నించారు. సామాజిక మాధ్యమంలో వచ్చిన ఆడియోపై వివరణ ఇవ్వాలని పట్టుబట్టారు. ఆ ఆడియో కుట్రపూరితంగా ఎడిట్‌ చేసి పెట్టారని సీఐ దుర్గాప్రసాద్‌ వివరించారు. నా వాయిస్‌ కాదు. రాజధాని ప్రాంతంలో మట్టి అక్రమ తవ్వకాలకు తావు లేదు. గుత్తేదారులు నిర్మాణ ప్రదేశాల్లో కాపలాదారులను పెట్టుకోవాలి. తమకు సిబ్బంది తక్కువ ఉన్నారు. అదనపు సిబ్బంది రాగానే గస్తీని మరింత ముమ్మరం చేస్తాం. రాజధానిలో నిర్మాణ సామగ్రి చోరీపై కొన్ని ఆధారాలు లభించాయి. నిందితులకు తగు శిక్షలు పడేలా చేస్తాం’ అని సీఐ వివరణ ఇచ్చారు.

ఏఎస్పీతో విచారణకు ఆదేశించా..

ఆడియోపై నేర విభాగం ఏఎస్పీతో విచారణకు ఆదేశించా. ఆ వీడియోలో మాట్లాడిన వ్యక్తి పోలీసు అధికారా? కాదా? అనేది నిర్ధారించుకోవాలి. తగు ఆధారాలు లేకుండా వెంటనే చర్యలకు ఉపక్రమించలేం. వాయిస్‌ ఎవరిది అనేది కూడా నిగ్గు తేల్చాలి. దర్యాప్తులో తేలిన విషయాలను బట్టి బాధ్యులపై తగిన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం.-విశాల్‌ గున్నీ, ఎస్పీ, గుంటూరు రూరల్‌

ఇదీ చదవండి:

రాజ్యసభలో మహిళా ఎంపీలపై దాడి- నిజమెంత?

Last Updated : Aug 13, 2021, 4:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.