ETV Bharat / city

తెలంగాణ మంత్రి కేటీఆర్​ పీఏనంటూ డబ్బులు డిమాండ్

ఓ గుర్తు తెలియని వ్యక్తి తెలంగాణ మంత్రి కేటీఆర్​ పీఏనంటూ హైదరాబాద్​ బంజారాహిల్స్​ రోడ్ నెంబర్​2లోని రెయిన్​బో ఆస్పత్రికి ఫోన్​ చేసి.. డబ్బులు డిమాండ్​ చేశాడు. ఈ విషయమై ఆస్పత్రి మేనేజర్​ దీపక్​ కుమార్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

fake phone call to banjarahills rainbow hospital from unknown person
తెలంగాణ మంత్రి కేటీఆర్​ పీఏనంటూ డబ్బులు డిమాండ్
author img

By

Published : Feb 21, 2021, 5:13 PM IST

తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్ 2లోని రెయిన్​బో ఆస్పత్రికి.. ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. ఆ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ పీఏ పేరిట డబ్బులు డిమాండ్ చేశాడు. తాను కేటీఆర్ వ్యక్తిగత సహాయకుడిగా పేర్కొన్న ఆగంతకుడు.. తన పేరు తిరుపతిరావు అని చెప్పాడు.

పెద్ద మొత్తంలో డబ్బులు కావాలని ఫోన్‌ చేశాడని ఆస్పత్రి మేనేజర్ దీపక్‌ కుమార్ తెలిపారు. మీడియాకు అడ్వర్జైజ్‌మెంట్‌, హోర్డింగ్‌లు ఏర్పాటు చేయడానికి డబ్బులు కావాలని అడిగినట్లు దీపక్‌కుమార్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

ఆంధ్రుడా మేలుకో.. విశాఖ ఉక్కును కాపాడుకుందాం: నారా రోహిత్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.