ETV Bharat / city

రక్షణ రంగంలో 'రఫేల్'​.. శత్రుదేశాలకు వణుకే..! - రఫేల్​ యుద్ధ విమానాలు

ఈ నెలాఖరున రఫేల్ యుద్ధ విమానాలు చేరితే.. భారత వాయుసేన శత్రుదేశాలకు సింహస్వప్నమేనని ఎయిర్ ఫోర్స్ విశ్రాంత స్క్వాడ్రన్ లీడర్ కాళిదాస్ అన్నారు. ప్రపంచంలో ఉన్న అత్యాధునిక యుద్ధ విమానాల్లో రఫేల్ ఒకటని.. నాలుగైదు విమానాలు కలిసి చేసే ధ్వంసం ఒక్క రఫేల్ చేయగలుగుతుందన్నారు. భారత్​కు రానున్న రఫేల్​లో అత్యాధునిక వ్యవస్థలు ఉన్నాయని.. ఒకేసారి 14 క్షిపణులు, బాంబులను తీసుకెళ్లే సామర్థ్యం వీటి సొంతమని కాళిదాసు తెలిపారు. రఫేల్ శత్రుదేశాల కంటి మీద కునుకు లేకుండా చేయడం ఖాయమని.. భారత్ రక్షణ రంగంలో రఫేల్.. ఒక గేమ్ చేంజర్ అంటున్న కాళిదాస్​తో ఈటీవీ భారత్ ముఖాముఖి...

రక్షణ రంగంలో 'రఫేల్'​.. శత్రుదేశాలకు వణుకే..!

author img

By

Published : Jul 24, 2020, 4:33 PM IST

రఫేల్​ యుద్ధ విమానాలు సింహ స్వప్నం అంటున్న ఎయిర్​ఫోర్స్​ విశ్రాంత స్క్వాడ్రన్​ లీడర్​

ప్ర. ప్రస్తుతం భారత్‌ వద్ద ఉన్న సుఖోయ్‌ 30, మిరేజ్‌ 2000, మిగ్‌ 29 యుద్ధ విమానాలతో పోలిస్తే రఫేల్‌ యుద్ధ విమానాల ఏ విధంగా భిన్నమైనవి?

జ.యుద్ధ విమానాలు మూడు రకాలు ఉంటాయి. ఆకాశం నుంచి శత్రు దేశాల భూమిపై ఉన్న యుద్ధ వ్యవస్థను ధ్వంసం చేసే బాంబర్స్ ఒకటి కాగా ... ఆకాశం నుంచి ఆకాశంలోని శత్రుదేశాల యుద్ధ విమానాలను కూల్చే ఇంటర్ సెప్టర్స్ రెండోది. ఇక మూడోది మల్టీరోల్ యుద్ధ విమానాలు. ఇప్పుడు భారత్​కు రానున్న రఫేల్... 4.5 జనరేషన్​కు చెందిన అత్యాధునిక మల్టీ రోల్ యుద్ధ విమానం. ప్రపంచంలో ఉన్న కేవలం నాలుగైదు అత్యాధునిక యుద్ధ విమానాల్లో ఇది ఒకటి. ఇది ఫోర్స్ మల్టీప్లయర్ యుద్ధ విమానం. అంటే.. నాలుగైదు యుద్ధ విమానాలు కలిసి చేసే ధ్వంసాన్ని.. ఒకే ఒక్క రఫేల్ చేయగలదు. చైనాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సందర్భంలో రఫేల్.. భారత వాయుసేనలో చేరడం మంచి పరిణామం.

ప్ర. పాక్‌, చైనా వద్ద ఉన్న యుద్ధ విమానాలతో పోలిస్తే రఫేల్‌ వల్ల మనకు కలిగే అదనపు ప్రయోజనాలు ఏంటి?

జ. పాకిస్థాన్, చైనాతో పోలిస్తే రఫేల్ ఆధునికమైంది. పాకిస్థాన్ వద్ద సుమారు 25 నుంచి 30 ఎఫ్-6 యుద్ధ విమానాలు ఉన్నాయి. చైనా నుంచి కొనుగోలు చేసిన ఏ-17 మన మిరాజ్ లాంటివి. కానీ రఫేల్ అత్యాధునికమైనది. రెక్కల కింద ఒకే సారి 14 క్షిపణులు, బాంబులను తీసుకెళ్లే సామర్థ్యం దీని ప్రత్యేకత. భూమిపై ఉన్న యుద్ధ వ్యవస్థను.. ఆకాశంలోని యుద్ధ విమానాలతో పాటు సముద్రంలోని యుద్ధ నావలను కూడా నాశనం చేయగలదు. శత్రుదేశాల విమానాలను గుర్తించే రాడార్ వ్యవస్థ కూడా రఫేల్​లో ఉంటుంది. ప్రపంచంలో అతి కొద్ది విమానాలకే ఈ సామర్థ్యం ఉంది. పాకిస్థాన్ యుద్ధ విమానాలతో పోలిస్తే ఎంతో శక్తివంతమైనది. చైనా వద్ద జే-20, జే-31 ఉన్నప్పటికీ... వాటిని ఇంత వరకు ఎప్పుడూ ఉపయోగించలేదు.

ప్ర.రఫేల్‌ యుద్ధ విమానాల ప్రత్యేకతలేంటి.. ఎలాంటి క్షిపణులు అమర్చవచ్చు.

జ.రఫేల్ యుద్ధ విమానంలో మైకా, మీటియార్, హ్యామర్ మిజైల్స్, స్కాల్స్ వంటి క్షిపణులతో దాడి చేయగలదు. క్షిపణులతో కలిపి అణుబాంబులను ప్రయోగించే సామర్థ్యం కూడా ఉంది. రఫేల్ యుద్ధ విమానాలు భారత వాయుసేనలో చేరితే.. శత్రుదేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.

ప్ర.ముందు కుదిరిన ఒప్పందం ప్రకారం కాకుండా కేవలం 36 రఫేల్‌ యుద్ధ విమానాలను మాత్రమే భారత్‌ ఎందుకు కొనుగోలు చేస్తోంది..భారత వైమానిక అవసరాలకు ఇవి సరిపోతాయా..?

జ. భారత వాయు సేన 126 రఫేల్ విమానాలు కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలుస్తోంది. ఎందుకంటే మిగ్-20 వంటి కాలం చెల్లిన యుద్ధ విమానాలు ఉన్నాయి. వాటి స్థానంలో రఫేల్ వంటి అత్యాధునిక యుద్ధ విమానాలు అవసరం. అయితే 36 మాత్రమే కొనుగోలు చేయడం కొంచెం నిరాశజనకమే. బడ్జెట్ కారణాలే అయి ఉండొచ్చు. కనీసం 126 ఉంటే.. మరో 30, 35 ఏళ్ల వరకు ఉపయోగపడేవి.

ప్ర. రఫేల్‌ యుద్ధ విమానాలను గేమ్‌ ఛేంజర్‌గా భావించవచ్చా..?

జ.రఫేల్ యుద్ధ విమానాల చేరిక.. రక్షణ రంగంలో కచ్చితంగా గేమ్ చేంజర్ అనే చెప్పవచ్చు. ఇది ఫోర్స్ మల్టిప్లయర్. అమెరికా, రష్యా వద్ద మాత్రమే ఇలాంటివి ఉన్నట్లు తెలుస్తోంది. చైనా వద్ద ఉన్నట్లు చెబుతున్నప్పటికీ.. ఇప్పటి వరకు వాడలేదు. కానీ రఫేల్ సామర్థ్యం ఇప్పటికే రుజువైంది. లిబియాలో వైమానిక స్థావరం కూల్చడంలో కీలక పాత్ర పోషించింది.

ఇదీ చూడండి:

కరోనా చికిత్స కోసం అదనంగా రూ.వెయ్యి కోట్లు: సీఎం జగన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.