గ్రూపు-1 కోసం అభ్యర్ధుల దరఖాస్తుల గడువును పొడిగించారు. ఈ నెల 4వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించేందుకు టీఎస్‌పీఎస్సీ అనుమతించింది. మంగళవారం అర్ధరాత్రి వరకు దరఖాస్తులు సమర్పించేందుకు గడువు విధించిన నేపథ్యంలో... చివరి రోజు 50 వేలకు పైగా దరఖాస్తులు అందాయి. ఒకే రోజు పెద్ద ఎత్తున దరఖాస్తులు రావడం, ఫీజు చెల్లింపుతో పాటు వివిధ రకాల సమస్యలను అభ్యర్ధులు టీఎస్‌పీఎస్సీ దృష్టికి తీసుకువచ్చారు. మంగళవారం రాత్రి పదకొండు గంటల వరకు 3 లక్షల 48వేల దరఖాస్తులు వచ్చాయి. కొత్తగా 1లక్షా 84వేల 426 ఓటీఆర్‌లు వచ్చాయి.
అభ్యర్ధుల ఇబ్బందులు, గడువు పొడిగించాలని వచ్చిన విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకుని టీఎస్‌పీఎస్సీ ఈ నెల 4వ తేదీ వరకు దరఖాస్తుల సమర్పణకు గడువు పొడిగించింది.
ఇవీ చదవండి: