మంత్రి జయరాంపై తెదేపా నేత, మాజీ మంత్రి కిడారి శ్రావణ్ తీవ్ర ఆరోపణలు చేశారు. అరకు నియోజకవర్గంలో 170 మంది రైతుల భూములను అధికార బలంతో మంత్రి కబ్జా చేశారని అన్నారు. ల్యాండ్ సీలింగ్ చట్ట ప్రకారం ఒక వ్యక్తిపై 43 ఎకరాలు మించి రిజిస్ట్రేషన్ చేయకూడదన్న ఆయన... ఈ నిబంధనలు లేకపోతే మొత్తం భూములన్నీ మంత్రి భార్య, మరదలు పేరుతోనే రిజిస్ట్రేషన్ చేసేవారని మండిపడ్డారు. అధికార దుర్వినియోగంతో మంత్రి జయరాం తప్పుడు పత్రాలు సృష్టించి పెద్ద ఎత్తున భూ అక్రమాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు.
భూదోపిడీ బట్టబయలైంది...
జగన్ అవినీతిని మంత్రులు ఆదర్శంగా తీసుకుంటున్నారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర దుయ్యబట్టారు. జగనే ఓ అవినీతి సామ్రాట్ కావటంతో తాము ఏమాత్రం తీసిపోమన్నట్లు మంత్రుల వ్యవహారశైలి ఉందని ఆరోపించారు. మంత్రుల అవినీతి సీఎం జగన్కు కనిపించడం లేదని విమర్శించారు. జయరాం బెంజ్ కార్ స్కామ్ మరవక ముందే వంద ఎకరాలు భూ దోపిడీ బట్టబయలైందని మండిపడ్డారు. ఓ ప్రైవేటు సంస్థకు చెందిన భూములను తన కుటుంబ సభ్యుల పేరిట బదలాయించుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ వైనంపై చర్యలు తీసుకోవాలని కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి