ETV Bharat / city

ప్రధాన వార్తలు @9 AM - ap update news

టాప్ టెన్ న్యూస్

9 am top news
టాప్ టెన్ న్యూస్
author img

By

Published : Feb 3, 2021, 9:01 AM IST

  • నేటి నుంచి రెండోదశ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ

రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ రెండో దశ ప్రక్రియ నేటి నుంచి అమలు కానుంది. తొలి విడతలో వైద్యారోగ్య సిబ్బందికి మాత్రమే పరిమితమైన వ్యాక్సినేషన్‌.. రెండో విడతలో మరిన్ని శాఖల సిబ్బందికి వేయనున్నారు. రెండో విడత టీకాల కోసం 5 లక్షల మందికి పైగా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • పంచాయతీ ఎన్నికలు... దొడ్డిదారిలో ఏకగ్రీవాలు!

ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాలు చేసేందుకు, ప్రతిపక్ష మద్దతుదారులు నామినేషన్లు వేయకుండా అడ్డుకునేందుకు అధికారపార్టీ నేతలు అన్ని రకాల అస్త్రాలూ ప్రయోగిస్తున్నారు. మొదట నచ్చజెబుతున్నారు.. ఆ తర్వాత బెదిరిస్తున్నారు. అప్పటికీ వినకపోతే కొన్నిచోట్ల భౌతిక దాడులకూ తెగబడుతున్నారు. ఉపాధి హామీ బిల్లులు ఆపేస్తామని హెచ్చరిస్తున్నారు. పదవులు పంచుకుందామంటూ బేరాలు ఆడుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఎన్నికల నిర్వహణపై నిఘా వ్యవస్థ: ఎస్ఈసీ

పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలపై ఎస్ఈసీకి ఉన్న అభిప్రాయాన్ని అత్యంత సుస్పష్టంగా చెప్పినా....కొందరు పెడార్ధాలు తీస్తున్నారని నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ అన్నారు. ఎక్కువ సంఖ్యలో ఏకగ్రీవాలు జరగడం శ్రేయస్కారం కాదని ఆయన పునరుద్ఘాటించారు. అదే సమయంలో ఎన్నికల తీరును పరిశీలించేందుకు నిఘా యాప్‌ను ఆవిష్కరిస్తున్నట్లు చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • మంగళగిరి ఎయిమ్స్‌’కు ఇసుక సమస్య!

ఇసుక సమస్యతో మంగళగిరి ఎయిమ్స్‌ నిర్మాణంలో జాప్యం జరిగినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సహాయమంత్రి అశ్వినీకుమార్‌ చౌబే తెలిపారు. మంగళవారం రాజ్యసభలో భాజపా సభ్యుడు సుజనాచౌదరి అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • నువ్వలరేవు.. ఈ గ్రామంలో ఎన్నికలు లేవు!

నువ్వలరేవు.. మత్స్యకారుల గ్రామం. ఇక్కడ గత 70 ఏళ్లలో ఎప్పుడూ పంచాయతీ పోరు జరగకపోవడం విశేషం. ఎన్నికల వేళ స్థానిక బృందావతి ఆలయ ప్రాంగణంలో గ్రామస్థులు సమావేశమై.. రిజర్వేషన్‌కు అనుగుణంగా సర్పంచి, ఎంపీటీసీ అభ్యర్థులను నిర్ణయిస్తారు. వారితోనే నామినేషన్‌ వేయిస్తారు. ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కొవిడ్​ టీకాపై సంకోచమే అసలు సమస్య

కరోనా మహమ్మారిని అరికట్టేందుకు పలురకాల వ్యాక్సిన్​లు అందుబాటులోకి వచ్చాయి. అయితే.. టీకా అందుకునేందుకు మాత్రం ఊహించినంత స్పందన కనబర్చకపోవడం గమనార్హం. వ్యాక్సిన్​పై నెలకొన్న భయాందోళనలు వీడకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. కొవిడ్‌ వ్యాక్సిన్లపై తప్పుడు అనుమానాల్ని, అపోహల్ని, నకిలీ వార్తలను తిప్పికొట్టడం ద్వారా తప్పుడు సమాచార వ్యాప్తిపై పోరాటం సాగించాలి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • రూ.329 కోట్లు విరాళాలు సేకరించిన వృద్ధుడు కన్నుమూత

వైద్య సిబ్బందికి సహాయం చేసేందుకు వంద రౌండ్ల పాటు నడిచి విరాళాలు సేకరించిన వృద్ధుడు టామ్ మూరే(100) కన్నుమూశారు. ఆయన మృతి పట్ల బ్రిటన్ ప్రధాని సంతాపం వ్యక్తం చేశారు. ప్రపంచానికే ఆయన ప్రేరణ అని కీర్తించారు. కరోనా సమయంలో పెరట్లో నడుస్తూ రూ.329 కోట్లు పోగు చేశారు మూరే. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కీలక 'వలస' ఉత్తర్వులపై బైడెన్ సంతకం

వలసదారుల​కు సంబంధించిన మూడు కీలక కార్యనిర్వాహక ఉత్తర్వులపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేశారు. దీని ప్రకారం.. కుటుంబ సభ్యుల నుంచి దూరమైన వలసదారుల చిన్నారులను తిరిగి వారి చెంతకు చేర్చనున్నారు. ట్రంప్​ తీసుకువచ్చిన వలస విధానాలను సమీక్షించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • టాప్​-20లోకి సాత్విక్-అశ్విని జోడీ

భారత మిక్స్​డ్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజు-అశ్విని పొన్నప్ప ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్​లో సత్తాచాటారు. వీరు టాప్-20లోకి దూసుకెళ్లి కెరీర్​లో అత్యుత్తమంగా 19వ ర్యాంకుకు చేరుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'మంచి సినిమా తీశాం.. ఆశీర్వదించండి'

తేజ సజ్జా, దక్ష నగార్కర్, ఆనంది ప్రధానపాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'జాంబీరెడ్డి'. శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు. మెగా హీరో వరుణ్ తేజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.