- నేటి నుంచి ‘ఏపీ పోలీస్ డ్యూటీ మీట్’.. ప్రారంభించనున్న సీఎం
రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న పోలీస్ డ్యూటీమీట్.. నేటి నుంచి ప్రారంభం కానుంది. తిరుపతిలో ఇవాళ్టి నుంచి 7వ తేదీ వరకూ నిర్వహించనున్న ఈ రాష్ట్రస్థాయి పోటీల కోసం పోలీస్ ఉన్నతాధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. వేడుకల్లో భాగంగా బలగాల విన్యాసాలు, ఆయుధసంపత్తి, సాంకేతిక నైపుణ్యాలు ప్రదర్శించనున్నారు. సైబర్ నేరాలు, మహిళాభద్రత తదితర అంశాలపై సింపోజియంను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బీటెక్ రవికి 14 రోజులు రిమాండ్.. కడప కేంద్ర కారాగారానికి తరలింపు..
పులివెందుల కోర్టులో బీటెక్ రవిని పోలీసులు హాజరుపరిచారు. పులివెందుల మేజిస్ట్రేట్ కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఈ క్రమంలో కడప కేంద్ర కారాగారానికి తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవిని పోలీసులు తరలించారు. 2018 మార్చి 4న పులివెందులలో జరిగిన ఘర్షణ కేసులో బీటెక్ రవిని ఆదివారం పోలీసులు చైన్నైవిమానాశ్రయంలో అరెస్టు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- దాచేపల్లిలో తెదేపా నేత దారుణ హత్య
కడప జిల్లా ప్రొద్దుటూరులో తెదేపా నేత నందం సుబ్బయ్య హత్య మరువకముందే అలాంటి ఘటనే మరొకటి జరిగింది. గుంటూరు జిల్లా దాచేపల్లిలో తెలుగుదేశం పార్టీ కీలక నేత పురంశెట్టి అంకులు ఆదివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. అధికార పార్టీ నాయకులే చంపేశారని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- గండికోట నిర్వాసితులను కదిలిస్తే.. కన్నీటి వరదే!
చుట్టూ నీళ్లు.. వెంటనే ఇళ్లు ఖాళీ చేయాల్సి వచ్చింది. రాత్రికి రాత్రి కట్టుబట్టలతో పిల్లా పాప.. ముసలీముతకా అంతా కలిసి గుడారాల్లోకి తరలిపోయారు. పేరుకు పునరావాస కేంద్రాలే అయినా ఒక్కదాంట్లోనూ సదుపాయాలు లేవు. ఒక్కో గుడారంలో 3, 4 కుటుంబాలుండాలి. కర్రలు పాతి.. చుట్టూ చీరలు కట్టిన ఏర్పాటే స్నానాల గది. కడప జిల్లా కొండాపురం మండలంలో గండికోట జలాశయ నిర్వాసితుల దుస్థితిదీ. వారిలో ఎవరిని కదిలించినా కన్నీటి వరదే. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'న్యాయాధికారి కావాలంటే న్యాయవాదిగా అనుభవం ఉండాల్సిందే'
న్యాయాధికారి ఉద్యోగాల పరీక్షలకు ఇక న్యాయవాదిగా పని చేసిన అనుభవం ఉండాలంటోంది.. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఈ నిబంధన పెట్టాలంటూ త్వరలోనే దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- టీకాల తయారీలో కొత్త చరిత్రకు నాంది
కొవిడ్ మహమ్మారిని తుదముట్టించడమే లక్ష్యంగా తయారు చేసిన వ్యాక్సిన్లకు.. అత్యవసర వినియోగానికి భారత్ తాజాగా అనుమతిచ్చింది. ఆస్ట్రాజెనికా-ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్‌ను సీరం సంస్థ ఉత్పత్తి చేస్తుండగా, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ బయోటెక్ రూపొందించిన వ్యాక్సిన్ ప్రాణ రక్షక ఔషధాల తయారీలో శాస్త్రవేత్తల మేధకు మెచ్చుతునక! ఈ వ్యాక్సిన్లు రెండూ భారత్‌లోనే తయారు కావడం ప్రతి పౌరుడికీ గర్వకారణమన్నది ప్రధాని మోదీ మాట. కొవిడ్‌పై ముందువరస పోరాట యోధులుగా మోహరించిన మూడు కోట్లమందికి త్వరలో మొదలుపెట్టనున్న టీకాల కార్యక్రమం- కొత్త చరిత్రకు నాంది కానుంది! పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- గ్రామాలపై తీవ్రవాదుల దాడి- 100 మంది మృతి
నైజర్‌లో ఇస్లామిక్ తీవ్రవాదులు రెచ్చిపోయారు. రెండు గ్రామాలపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సుమారు వంద మంది మరణించారు. ఈ గ్రామాలను నైజర్ ప్రధాని సందర్శించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఎన్నికల మోసాలపై రిపబ్లికన్ పార్టీలో చీలికలు!
అమెరికా అధ్యక్ష ఫలితాలను మార్చేయాలని డొనాల్డ్ ట్రంప్ అకుంఠిత దీక్ష చేస్తున్నారు. అధికార బదిలీని నిరాకరించాలని, బైడెన్ గెలుపును సవాల్ చేయాలని లెక్కలేనన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ ప్రయత్నాలే తన పార్టీలో చిచ్చు పెట్టేలా కనిపిస్తున్నాయి. ట్రంప్ వైఖరికి కొందరు మద్దతిస్తుండగా.. మరికొందరు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వీళ్లను ఔట్ చేయగలమా అని అనుకున్నాం: ఆసిఫ్
2006లో భారత పటిష్ఠ బ్యాటింగ్ లైనప్ చూసి ఆందోళన చెందినట్లు చెప్పాడు పాక్ మాజీ పేసర్ మహ్మద్ ఆసిఫ్. వాళ్లను ఔట్ చేయడానికి తీవ్రమైన కృషి చేయాల్సి వచ్చేదని చెప్పాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సంక్రాంతికి హీరోలు సై.. బరిలో నాలుగు సినిమాలు
ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి. ఇందులో క్రాక్, మాస్టర్, రెడ్, అల్లుడు అదుర్స్ ఉన్నాయి. మరి ప్రేక్షకుల్ని ఎంతలా అలరిస్తాయో చూడాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.