- సీనియర్ నటుడు జయప్రకాశ్‌రెడ్డి కన్నుమూత
సీనియర్ నటుడు జయప్రకాశ్‌రెడ్డి గుండెపోటుతో స్నానాల గదిలోనే కుప్పకూలిపోయారు. కర్నూలు జిల్లా సిరివెళ్లకు చెందిన జయప్రకాశ్.. రాయలసీమ యాసలో సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'గత ప్రభుత్వ నిర్ణయాలను పునఃసమీక్షించడం సరికాదు'
గత ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించడం దుష్ట సంప్రదాయమని హైకోర్టులో తెదేపా నేతల తరఫు న్యాయవాదులు వాదించారు. గత ప్రభుత్వ నిర్ణయాల పునఃసమీక్ష కోసం.. ప్రస్తుత ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లపై తన వాదనలు వినిపించారు. ఈ తరహా గతంలో ఎన్నడూ జరగలేదని... ఇది రాజ్యాంగ విరుద్ధమని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. సిట్ ఏర్పాటు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- డీఆర్డీఓకు ప్రధాని మోదీ ప్రశంసలు
హైపర్సోనిక్ సాంకేతికతను విజయవంతంగా ప్రయోగించినందుకు భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ)ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ వాహక నౌకను ఒడిశా వీలర్ ఐలాండ్ నుంచి ప్రయోగించింది డీఆర్డీఓ. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అంతర్వేదిలో కొనసాగుతున్న దర్యాప్తు
అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోని దివ్య రథం దగ్ధమైన ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. నెల్లూరు, అంతర్వేది దేవస్థానాల్లో రథాలను దగ్ధం చేసిన నిందితులపై చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లంపల్లి తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆసుపత్రులకు ఆక్సిజన్ సిలిండర్ల సరఫరాలో జాప్యం
రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. వాటికి అనుగుణంగానే ఆసుపత్రుల్లో ఆక్సిజన్ అవసరాలూ పెరుగుతున్నాయి. అయితే ఆసుపత్రులకు ఆక్సిజన్ సిలిండర్ల సరఫరాలో జాప్యం జరగటం ఆందోళన కలిగిస్తోంది. రోగుల వార్డుల్లో మందకొడిగా ఆక్సిజన్ పైపులైన్ల ఏర్పాటు ఉంది. సరైన పర్యవేక్షణ లేక 30% వరకు ఆక్సిజన్ సరఫరా వృథా అవుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- యునెస్కో వారసత్వ కట్టడాల పరిశీలనకు 6 మొఘల్ గార్డెన్లు
యునెస్కో వారసత్వ కట్టడాల పరిశీలనకు జమ్ముకశ్మీర్‌లోని ఆరు మొఘల్ గార్డెన్స్‌ను సిఫారసు చేయనున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్‌సిన్హా. ఇప్పటికే లోయలోని 8 గార్డెన్లను యునెస్కో ప్రతినిధులు సందర్శించి తాత్కాలిక జాబితాలో చేర్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- స్టాక్ మార్కెట్లకు సెప్టెంబర్‌లో ఒడుదొడుకులు!
ఆటుపోట్లు ఎదురైనా ఆగస్టులో భారీగా లాభాలను గడించిన స్టాక్ మార్కెట్లకు సెప్టెంబర్‌లో మాత్రం ఒడుదుకులు తప్పేలా లేవు. అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో విదేశీ మదుపరుల పెట్టుబడులు నెమ్మదించడం వల్ల సెప్టెంబర్‌లో ఒడుదొడుకులు ఎక్కువగా ఉంటాయని ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ అంచనా వేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆగని కార్చిచ్చు- 20 లక్షల ఎకరాలకుపైగా దగ్ధం
కాలిఫోర్నియా అడవుల్లో మంటలు విస్తరిస్తున్నాయి. ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఇప్పటికే 20 లక్షల ఎకరాలకుపైగా అడవులు అగ్నికి ఆహుతైనట్లు తెలిసింది. పూర్తి వివరాలి కోసం క్లిక్ చేయండి.
- ఫ్రెంచ్ ఓపెన్: అప్పుడు 5 లక్షలు.. ఇప్పడు 5 వేలు
టెన్నిస్ అభిమానులకు శుభవార్త చెప్పింది ఫ్రెంచ్ టెన్నిస్ సమాఖ్య. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్‌ను అభిమానులు ప్రత్యక్షంగా వీక్షించేందుకు అవకాశం ఇస్తోంది. అయితే కేవలం 5వేల మంది ప్రేక్షకులకే ఈ ఛాన్స్ దక్కనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- హాలీవుడ్ చిత్రానికి పోటీగా.. సుశాంత్ 'దిల్ బేచారా' వసూళ్లు
దివంగత నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ నటించిన చివరి చిత్రం 'దిల్ బేచారా'కు విదేశాల్లోనూ విశేషాదరణ లభిస్తోంది. ఫిజి, న్యూజిలాండ్ దేశాల్లో హాలీవుడ్ చిత్రమైన 'టెనెట్'కు పోటీగా వసూళ్లు రాబడుతోందని సినీవిశ్లేకులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.