ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 1 PM - ఏపీ లేటెస్ట్ వార్తలు

.

top ten news
టాప్ టెన్ న్యూస్
author img

By

Published : Apr 23, 2021, 1:03 PM IST

  • 'అక్కాచెల్లెమ్మలు బాగుంటేనే కుటుంబం బాగుంటుంది'
    మహిళలు బాగుంటేనే సమాజం బాగుంటుందన్న సిద్ధాంతాన్ని ప్రభుత్వం గట్టిగా నమ్ముతోందని.. అందుకే స్త్రీ సాధికారతకు కృషి చేస్తోందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. గత 23 నెలలుగా ప్రభుత్వం వేస్తున్న ప్రతి అడుగులో మహిళా సాధికారత లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. స్వయం సహాయక సంఘాలకు రూ.1,109 కోట్ల సున్నా వడ్డీ నిధులను ముఖ్యమంత్రి విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • ఆ రాష్ట్రాల సీఎంలతో మోదీ కీలక భేటీ
    కొవిడ్​ పరిస్థితి ప్రమాదకర స్థాయిలో ఉన్న రాష్ట్రాల సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఆయా రాష్ట్రాల్లో పరిస్థితిని సమీక్షించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • కరోనా పంజా... అడుగంటుతున్న ఆక్సిజన్ నిల్వలు
    ఆక్సిజన్‌ కొరత.. ఇప్పుడు దేశవ్యాప్తంగా కలవరానికి గురిచేస్తున్న అంశం ఇది. అక్కడ, ఇక్కడ అని లేదు.. గల్లీ నుంచి దిల్లీ వరకు ఇదే పరిస్థితి. కొన్ని ఆసుపత్రులైతే.. ఆక్సిజన్‌ సిలిండర్లు బాధితులే తెచ్చుకోవాలి లేకపోతే చేర్చుకోమని తెగేసి చెబుతున్నాయి. మరికొన్ని చోట్ల.. లక్షలు ఇస్తామంటున్నా ఆక్సిజన్‌ సిలిండర్లు దొరకని దుస్థితి. దీంతో.. ప్రాణవాయువు సకాలంలో అందక.. ఊపిరిపోతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నాసిక్‌లో చోటు చేసుకున్న దుర్ఘటన వాటి అన్నింటికీ పరాకాష్ఠ. ప్రస్తుతం.. రోజూ వారి కేసులు 3 లక్షలు నమోదవుతుండటంతో... ఆక్సిజన్‌ కొరతతో ఇంకెన్ని ప్రాణాలు గాలిలో కలిసిపోతాయో ? అన్న ప్రశ్నే భయం పుట్టిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • మెుదట పరిగెత్తారు.. ఆ తర్వాత దండాలు పెట్టారు!
    మెుదట మూలన నక్కి ఉన్న పామును చూసి తలో దిక్కుకు పారిపోయారు.. పాములు పట్టేవారికి సమాచారం అందించటంతో.. అతను వచ్చి పామును బంధించాడు. అనంతరం పాముని పట్టుకొని దండాలు పెట్టేశారు.. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా పాశర్లపూడి సమీపంలో జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • ఆక్సిజన్​ కొరతపై సుప్రీం సీరియస్​
    కరోనా నియంత్రణ అంశంపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ప్రజలు ఆక్సిజన్​ అందక చనిపోతున్నారని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎస్​ఏ బోబ్డే అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • వాజేకు సహకరించిన మరో పోలీసు అరెస్టు!
    ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్​ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసులో మరో పోలీసు అరెస్టయ్యారు. ఈ కేసులో సస్పెండైన సచిన్ వాజేకు సహకారం అందించినట్లుగా భావిస్తున్న సునీల్​ మానేను అరెస్టు చేశారు ఎన్​ఐఏ అధికారులు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • రిలయన్స్ ఉద్యోగులకు మే 1 నుంచి ఉచిత టీకా
    రిలయన్స్ ఉద్యోగులకు కరోనా టీకా ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఉద్యోగితో పాటు.. భాగస్వామి, తల్లిదండ్రులు, పిల్లల టీకాలకయ్యే పూర్తి ఖర్చును కంపెనీ భరిస్తుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటన విడుదల చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • అమెరికాలో కొత్త రాష్ట్రానికి ప్రతినిధుల సభ ఆమోదం
    అమెరికాలో 51వ రాష్ట్రంగా వాషింగ్టన్​ డీసీని గుర్తించాలంటూ ప్రవేశపెట్టిన ఓ బిల్లుకు ప్రతినిధుల సభలో ఆమోదం లభించింది. సెనేట్​లో ఈ బిల్లుకు ఆమోదం లభించే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • దిల్లీ క్యాపిటల్స్​ క్యాంప్​లో అక్షర్​ పటేల్​
    కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న దిల్లీ క్యాపిటల్స్​ ఆల్​రౌండర్​ అక్షర్​ పటేల్​ తిరిగి జట్టులోకి చేరాడు. ఈ విషయాన్ని దిల్లీ ఫ్రాంఛైజీ ట్విట్టర్​లో వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • రాధే ట్రైలర్​.. సల్మాన్​కు సోషల్​మీడియా సెగ
    బాలీవుడ్​ స్టార్​ హీరో సల్మాన్​ ఖాన్​ నటించిన 'రాధే' సినిమాకు సోషల్​ మీడియా సెగ తగిలింది. ఏప్రిల్​ 22న ట్రైలర్​ విడుదలైనప్పటి నుంచి.. ఈ సినిమాను బాయ్​కాట్​ చేస్తామంటూ నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో ట్రోల్​ చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.