కడప జిల్లా రైల్వేకోడూరులో లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన నాయీబ్రాహ్మణులకు ఆర్థిక సహాయం చేశారు. వైకాపా నేత హేమనవర్మ ఆర్థిక సహాయంతో స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాసులు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున 110 మందికి అందించారు. ప్రతి నాయీబ్రాహ్మణ కుటుంబానికి మూడు మాస్కులు పంపిణీ చేశారు. లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న ప్రతి పేద కుటుంబానికి వైకాపా ప్రభుత్వం అండగా ఉంటుందని, ఎవరూ అధైర్య పడవద్దని ఎమ్మెల్యే ధైర్యం చెప్పారు.
తూర్పుగోదావరి జిల్లాలో మాస్కులు పంపిణీ...
తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో ఏఎస్పీ వకుల్ జిందాల్‌కు మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి మాస్కులను అందించారు. లాక్డౌన్ సమయంలో అత్యవసర సేవలందిస్తున్న పోలీసు సిబ్బంది సేవలను ఆమె ప్రశంసించారు. రావులపాలెంలో లిటిల్ ఫ్లాక్ చర్చి ఆధ్వర్యంలో పాస్టర్లకు నిత్యావసర వస్తువులు అందించారు. లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలను ఆదుకోవడం ఎంతో ఆనందంగా ఉందని దాతలు అన్నారు.
ప్రకాశం జిల్లాలో...
ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలంలో రెడ్‌జోన్‌గా గుర్తించిన రావినూతల గ్రామంలో నిత్యావసర సరకుల కోసం ఇబ్బందులు పడుతున్న గ్రామస్థులకు అద్దంకి నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జీ బాచిన కృష్ణ చైతన్య నిత్యావసరాలు పంపిణీ చేశారు.
ఇదీచదవండి.