కరోనా వ్యాప్తి నిరోధానికి రాష్ట్ర సచివాలయంలోనూ కఠిన ఆంక్షలు అమలు చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 23 నుంచి ఉద్యోగులు మినహా బయట వ్యక్తులను సచివాలయానికి అనుమతించకూడదని నిర్ణయించారు. కొందరు ఉద్యోగులు హైదరాబాద్ నుంచి వచ్చి వెళ్తున్నందున వారికి వర్క ఫ్రమ్ హోమ్‌కు అనుమతి ఇవ్వాలని.. సచివాలయ ఉద్యోగులు సీఎస్‌ను అభ్యర్థించారు. పరిస్థితులు మెరుగుపడేంత వరకూ ఈ వెసులుబాటు కల్పించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇళ్ల పట్టాల పంపిణీకి సభలు వద్దు
మరోవైపు.. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం అమలును వాలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా చేపట్టాలని రెవెన్యూ ఉద్యోగులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సభ నిర్వహించి పట్టాలు ఇవ్వడం క్షేమం కాదని అభిప్రాయపడ్డారు.
ఇదీ చూడండి: