సచివాలయ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు ఈరోజు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశమయ్యారు. పీఆర్సీతోపాటు ఇతర అంశాలపైనా చర్చించామని ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి ఒడిశా పర్యటన తర్వాత పీఆర్సీ అంశంపై స్పష్టత వస్తుందని సీఎస్ తెలియజేశారన్నారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో లేవనెత్తిన అంశాలను చర్చిస్తామని చెప్పారన్నారు. రెండేళ్లు పనిచేసినా... పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శుల సేవల క్రమబద్ధీకరణ ప్రక్రియ ప్రారంభమైందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసినందున.. ఈ విషయంలో ఎవరూ ఆందోళన అవసరం లేదన్నారు. లక్ష 34 వేల మంది ఉద్యోగులు ఉండడం... ఒక్కో జిల్లాకు పది వేల మంది వరకు పని చేస్తున్నందున... వారి సర్వీసు వివరాల పరిశీలనలో కొంత ఆలస్యం అవుతోందన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు అందాయని... రెండేళ్లు ఎప్పటికీ పూర్తవుతుందో అప్పటి నుంచే వారి సేవలను క్రమబద్ధీకరణలో పరిగణనలోకి తీసుకుంటారన్నారు.
పీఆర్‌సీని వారంలోగా తేల్చాలి. రూ.కోట్ల పెండింగ్ నిధుల విడుదలపై కార్యాచరణ చెప్పాలి. 2018 జులై 1 నుంచి పీఆర్‌సీ అమలు చేయాలి.60 శాతం మేర పీఆర్‌సీ ప్రకటించాలనేది మా డిమాండ్ - అమరావతి ఐకాస ఛైర్మన్ బొప్పరాజు
రెండ్రోజుల్లో నివేదిక: బండి శ్రీనివాసరావు
బండి శ్రీనివాసరావు మోహన్‌గారు రెండ్రోజుల్లో పీఆర్‌సీ నివేదిక ఇస్తామని సీఎస్ అన్నారు.పీఆర్‌సీ నివేదికను ఇవాళా ఇవ్వకపోవడం బాధగా ఉంది.పీఆర్‌సీ నివేదికను బుధవారమైనా ఇస్తారని భావిస్తున్నాం - బండి శ్రీనివాసరావు, ఎన్జీవో సంఘం
ఇదీ చదవండి: CM KCR: నాకు సమాధానం కావాలి... అప్పటివరకు భాజపాను వదిలిపెట్టను: కేసీఆర్