ETV Bharat / city

ELECTION CAMPAIGN: జోరుగా ప్రచారం... ఓట్ల అభ్యర్థనలో ముఖ్య నేతలు - parishadh elections in andhrapradesh

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం జోరందుకుంది. తమ పార్టీకి చెందిన అభ్యర్థులను గెలిపించాలంటూ.. ముఖ్య నేతలు ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

జోరుగా ప్రచారం
జోరుగా ప్రచారం
author img

By

Published : Nov 10, 2021, 7:19 PM IST

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జరగనున్న నగరపాలక, పరిషత్ ఎన్నికల కోసం అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎవరికి తగ్గట్టు వారు తమ తమ నాయకులను ప్రచారాల్లో అస్త్రాలుగా ఉపయోగిస్తున్నారు. ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీ ఎన్నికల కోసం.. తెదేపా నేతలు ప్రచారం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా హిరమండలం మండలంలో తెదేపా నాయకులు ప్రచార కార్యక్రమం నిర్వహించారు.

నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం కోసం అభ్యర్థులు ఇంటింటి ప్రచారం ముమ్మరం చేశారు. తెదేపా అభ్యర్థులకు మద్దతుగా ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప పలువురు నేతలు ప్రచారాన్ని నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు నగర పాలక సంస్థ ఎన్నికల వేడి మొదలైంది. వైకాపా నాయకులు ఎన్నికల ఉల్లంఘనకు పాల్పడుతున్నారని తెదేపా నేతలు విమర్శించారు.

ఇదీచదవండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.