ETV Bharat / city

SCHOOLS REOPENING: రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు పునః ప్రారంభం - రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు పునః ప్రారంభం

schools
schools
author img

By

Published : Aug 16, 2021, 9:22 AM IST

Updated : Aug 16, 2021, 10:45 AM IST

09:18 August 16

కరోనా నిబంధనలు కచ్చితంగా అమలు

రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు పునః ప్రారంభం

రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఒకటి నుంచి పదో తరగతి విద్యార్దులతో పాటు ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్ధులకు కూడా తరగతులు ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 61వేల 137 ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేటు పాఠశాలలకు బడిగంట మోగింది. అన్ని పాఠశాలలో కరోనా నిబంధనలు అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పాఠశాలల్లో మాస్కు, భౌతికదూరం, థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి చేసింది.  

ప్రతి తరగతి గదిలో 20 మంది విద్యార్ధులకు మాత్రమే అనుమతించి భోదన చేస్తున్నారు. విద్యార్ధులు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరిస్తూ శానిటైజర్‌ తెచ్చుకుని పాఠశాలలకు రావాలని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు. పాఠశాలల్లోకి వచ్చే ముందు ప్రతి విద్యార్ధిని ఉష్ణోగ్రత పరిశీలించిన అనంతరమే తరగతి గదిలోకి అనుమతిస్తున్నారు. ఇవాళ మొదటి రోజు విద్యార్ధుల హాజరును బట్టి రోజు మార్చి రోజు పాఠాలు భోదిస్తామని ఉపాధ్యాయులు చెబుతున్నారు. కరోనా మూడో వేవ్‌ ముప్పు ఉందని చెప్పినప్పటికీ కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూనే పాఠశాలల్లో విద్యాభోదన సాగిస్తామని తెలిపారు

నేటి నుంచి నూతన విద్యా విధానం..

పాఠశాల విద్యలో నేటి నుంచి నూతన విద్యా విధానం అమలు చేస్తున్నారు. పాఠశాల విద్యా వ్యవస్థ ఆరు విభాగాలుగా  మారనుంది. పూర్వ ప్రాథమిక విద్య1, 2 శాటిలైట్ ఫౌండేషన్ బడులుగా మారనున్నాయి. ప్రీప్రైమరీ 1,2  సహా ఒకటి, రెండు తరగతులు ఉంటే ఫౌండేషన్, 1 నుంచి 5 తరగతులు ఉంటే ఫౌండేషన్ ప్లస్ గా మారనున్నాయి. 3 నుంచి 8వ తరగతి వరకు ఉంటే ప్రీ హైస్కూళ్లు, 3 నుంచి 10వ తరగతి వరకు ఉంటే ఉన్నత పాఠశాలలు, 3 నుంచి 12 వరకు ఉంటే  హైస్కూల్ ప్లస్ గా మారనున్నాయి.

ఇదీ చదవండి:

'విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు' పిటిషన్​పై సీబీఐ కోర్టులో నేడు మరోసారి విచారణ

Last Updated : Aug 16, 2021, 10:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.