దీపావళి అంటేనే కాకరపువ్వొత్తులు, మతాబులు, సిచ్చుబుడ్లు కాల్చే పండుగ. ఈ ఏడాది కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా.. పరిమిత సమయంలోనే బాణసంచా సామగ్రిని వాడాలని ప్రభుత్వం సూచించింది. క్రాకర్స్ కాల్పడం వల్ల వచ్చే పొగ, ధూళితో మహమ్మారి బారిన పడ్డ వారికి ఇబ్బంది కలగకూడదని ఈ నిర్ణయం తీసుకుంది. వైద్యులు సైతం బాణసంచాకు దూరంగా ఉండాలని హితవు పలుకుతున్నారు .
వ్యాప్తి చెందే అవకాశం...
కరోనా లక్షణాలున్న వాళ్లు క్రాకర్స్ కాలిస్తే వైరస్ వ్యాప్తి చెందే అవకాశముందని అంటున్నారు. గాలిలో ఉండే దుమ్ము కణాలు , క్రాకర్స్ నుంచి వచ్చే కాలుష్యం పీల్చినపుడు ...అవి ఊపిరితిత్తుల్లో పేరుకుపోయి చిన్న పిల్లలకు ఇబ్బందులు ఎదురవుతాయని శ్వాసకోస నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా నిబంధనలు పాటిస్తూ.. ఎవరి ఇంటి వద్ద వారు పండగ చేసుకోవాలని సూచిస్తున్నారు.
జాగ్రత్తలు పాటించాల్సిందే...
గ్రీన్ క్రాకర్స్ వినియోగిస్తే కొంతమేర వాయు కాలుష్యాన్ని నివారించవచ్చని వైద్యులు చెబుతున్నారు. చలికాలంలో కరోనా వైరస్ ఎక్కువ సేపు జీవించి ఉండే అవకావముంటుందని... ప్రజలంతా జాగ్రత్తలు పాటిస్తూ పండుగ జరుపుకోవాలని హెచ్చరిస్తున్నారు.
ఇదీ చదవండి
వైద్య విద్య ప్రవేశాలకు ఎన్టీఆర్ వర్సిటీ నోటిఫికేషన్ విడుదల