ETV Bharat / city

Omicron effect on Children: 'పిల్లలపైనా ఒమిక్రాన్‌ ప్రభావం.. బాధితుల్లో 22 శాతం చిన్నారులే' - తెలంగాణ వార్తలు

Omicron effect on Children : పిల్లలపై ఒమిక్రాన్ పంజా విసురుతోంది. అమెరికాలోని బాధితుల్లో 22 శాతం మంది చిన్నారులే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. భారత్‌లోనూ అదే తీరులో అవకాశాలు ఉండనున్నాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. కొవిడ్‌ మనల్ని వదిలిపెట్టి పోయే పరిస్థితి లేదని... ఆరు నెలలకొకోసారి బూస్టర్‌ డోసు తీసుకోక తప్పదని చెబుతున్న ఆపీ అధ్యక్షురాలు డాక్టర్‌ అనుపమతో ఈనాడు-ఈటీవీ భారత్ ముఖాముఖి.

Omicron effect on Children
Omicron effect on Children
author img

By

Published : Jan 5, 2022, 9:38 AM IST

Omicron effect on Children : ‘‘అమెరికాలో 5 ఏళ్ల చిన్నారులకు కూడా టీకా అందుబాటులో ఉంది. 12 ఏళ్లు పైబడినవారికి ఇటీవలే మూడోడోసుకు అనుమతించారు. అక్కడ ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రభావం పిల్లలపై ఎక్కువగానే ఉంది. అమెరికాలో ప్రస్తుతం మొత్తం పాజిటివ్‌ల్లో 22 శాతం కేసులు పిల్లల్లోనే. ఇది గతంలో 5 శాతంలోపే ఉండేది. భారత్‌లోనూ పిల్లలపై ఒమిక్రాన్‌ ప్రభావం ఎక్కువగానే కనిపించే అవకాశాలున్నాయి. త్వరలో భారత్‌లోనూ మూడోదశ ఉధ్ధృతికి అవకాశాలు ఎక్కువే. ఒమిక్రాన్‌ విషయంలో అప్రమత్తత అవసరం’’ అని భారత సంతతి అమెరికా వైద్యుల సంఘం (ఆపీ) అధ్యక్షురాలు డాక్టర్‌ అనుపమ గొట్టిముక్కల వెల్లడించారు. వరంగల్‌లో ప్రాథమిక విద్య.. కాకతీయ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌.. ఉస్మానియాలో పీజీ అనస్థీషియా పూర్తి చేసిన అనంతరం.. 22 సంవత్సరాల కిందట అమెరికాకు వెళ్లి.. అక్కడ పీడియాట్రిక్‌ అనస్థీషియాలో పట్టా పొందారు. ప్రస్తుతం భారత సంతతి అమెరికా వైద్యుల సంఘం అధ్యక్షురాలిగా సేవలందిస్తున్నారు. ఈనెల 5 నుంచి 7 వరకూ ఆపీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ‘గ్లోబల్‌ హెల్త్‌కేర్‌ సమ్మిట్‌’లో పాల్గొనేందుకు వచ్చిన డాక్టర్‌ అనుపమతో ‘ఈనాడు-ఈటీవీ భారత్’ ముఖాముఖి.

డాక్టర్‌ అనుపమ

గ్లోబల్‌ హెల్త్‌ కేర్‌ సమ్మిట్‌ నిర్వహణ లక్ష్యాలేమిటి?
భారత్‌-అమెరికా మధ్య వైద్య విజ్ఞానంలో పరస్పర అవగాహన కోసం ఏటా నిర్వహిస్తుంటాం. పుట్టిన గడ్డకు ఎంతోకొంత సేవ అందించాలనేది ప్రధాన లక్ష్యం. ఇక్కడి వైద్యుల సహకారంతో భారత్‌లో ఉచితంగా క్లినిక్‌లు నిర్వహిస్తుంటాం. అమెరికా నుంచి కూడా స్పెషలిస్టులొచ్చి సేవలందిస్తుంటారు. అవసరమైతే సర్జరీలు కూడా చేస్తుంటారు.

ఆపీ ఆధ్వర్యంలో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు?
గ్రామీణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా భారత్‌లో 75 గ్రామాలను ఆపీ దత్తత తీసుకుంది. పల్లెల్లో ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం. ఆర్నెల్లకోసారి ఉచిత రోగ నిర్ధారణ పరీక్షల శిబిరాలు నిర్వహిస్తుంటాం. గ్రామీణ భారతంలో సుమారు 30-40 శాతం మంది మాత్రమే ఆరోగ్యంగా ఉన్నారు. మిగిలినవారు ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. అమెరికాలో 40 ఏళ్లు దాటాక ఏటా వైద్య పరీక్షలు తప్పనిసరి. భారత్‌లోనూ ఆ అవగాహన తీసుకురావాలనేది మా ప్రయత్నం.

శాస్త్ర సాంకేతిక వైద్య, విద్యా రంగాల్లో ముందున్న అమెరికాలోనూ ఎందుకు కొవిడ్‌ను నియంత్రించలేకపోతున్నారు?
ఒమిక్రాన్‌ వేరియంట్‌.. డెల్టా కంటే 4 రెట్లు అధిక వేగంతో వ్యాప్తి చెందుతోంది. అక్కడి ప్రజల్లో కొవిడ్‌ పట్ల ఉదాసీనత ఉంది. చాలామంది మాస్కులు పెట్టుకోవడం లేదు. అక్కడ 30-40 శాతం మంది ఇప్పటికీ కొవిడ్‌ టీకాలు తీసుకోలేదు. ఇటువంటి వారిలో కొవిడ్‌ తీవ్రత, వ్యాప్తి ఎక్కువగా ఉన్నాయి.

అమెరికాలో బూస్టర్‌ డోసు కూడా ఇచ్చారు కదా.. అయినా ఎందుకు వ్యాప్తి ఎక్కువ?
నిజానికి కొవిడ్‌ నివారించదగినదే. మాస్కు పెట్టుకుంటే రానే రాదు. టీకా కూడా తీసుకుంటే వ్యాప్తికి అవకాశాలు చాలా తక్కువ. అయితే ఒమిక్రాన్‌ వేరియంట్‌ టీకాల సామర్థ్యాన్ని కూడా ఛేదిస్తోంది. అందుకే వ్యాక్సిన్‌ వేసుకున్న వారికి కూడా వస్తోంది. కానీ వారిలో స్వల్ప జలుబు లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ప్రభావ తీవ్రత లేదు. డెల్టా వేరియంట్‌ సమయంలో కూడా వ్యాక్సిన్‌ 95 శాతం రక్షణ కల్పించింది. ఇతర అనారోగ్య సమస్యలున్న వారిలో కేవలం 5 శాతం మందికి మాత్రమే కొంత సమస్యను సృష్టించింది. ఆసుపత్రిలో చేరి చికిత్స పొందినవారిలో 95 శాతం మంది టీకాలు పొందని వారే. ఇన్‌ఫెక్షన్‌ సోకిన వారిలో సహజసిద్ధంగా రోగ నిరోధక శక్తి వచ్చినా.. అది ఆర్నెల్ల వరకే ఉంటోంది. దీంతో తిరిగి ఇన్‌ఫెక్షన్‌ బారినపడుతున్నారు. కొవిడ్‌ ఎక్కడికీ పోదు. దాంతో కలిసి ప్రయాణించాల్సిందే. ఆర్నెల్లకోసారి బూస్టర్‌ డోసు వేసుకోక తప్పదు.

భారత్‌లో కొవిడ్‌ మూడోదశ ఉద్ధృతి ఎలా ఉండబోతోంది?
భారత్‌లోనూ త్వరలోనే మూడోదశ వచ్చే అవకాశముంది. జనవరి నెలాఖరు, ఫిబ్రవరి తొలివారాల్లో గరిష్ఠ స్థాయికి చేరుకుంటుంది. అయితే మరణాల సంఖ్య తక్కువే ఉండొచ్చు. పరీక్షల సంఖ్య పెంచాలి. త్వరగా గుర్తించడం, చికిత్స పొందడం ద్వారా తీవ్ర దుష్ప్రభావాల బారినపడకుండా జాగ్రత్తపడొచ్చు. వ్యాక్సిన్‌ వేసుకున్నా, వేసుకోకపోయినా కొవిడ్‌ వస్తుంది. అయితే టీకా పొందినవారిలో ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం అతి స్వల్పం. మరణ భయం తక్కువ.

ఇదీ చదవండి: Telangana Corona Cases: రాష్ట్రంలో కరోనా విజృంభణ... ఒక్కరోజే 1,052 కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.